Top 5 Smartphones: రూ.20,000 లోపు లభించే టాప్ 5 స్మార్ట్‌ ఫోన్లు ఇవిగో

Top 5 Smartphones: మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపు అయితే టాప్ 5 స్మార్ట్ ఫోన్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరు, ఇతర స్పెషల్ ఫీచర్లు ఏ ఫోన్లలో బెస్ట్ గా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Top 5 Smartphones Under Rs 20000 April 2025 in telugu sns

స్పెషల్ ఫీచర్లు కలిగిన 5G ఫోన్‌లు ఇప్పుడు రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ కెమెరాలు, మంచి బ్యాటరీలు, బలమైన చిప్‌సెట్‌లు, అద్భుతమైన అమోల్డ్ స్క్రీన్‌ల వరకు ధరకు సరిపడా బెస్ట్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. టాప్ 5 స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Smartphones Under Rs 20000 April 2025 in telugu sns

రియల్ మి P3

Realme P3 5G రూ.16,999 ధర కలిగిన స్మార్ట్ ఫోన్ ఇది. స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా 6.67 అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉపయోగించడం వల్ల రోజంతా పవర్‌ను అందిస్తుంది.

Realme P3 ఫోన్ లో 6 Gen 4 CPU, IP69 వాటర్ రెసిస్టెంట్ గ్రేడ్ ఉన్నాయి. అందువల్ల ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోటోలు తీసుకోవాలనుకొనే వారికి ఈ ఫోన్ బాగుంటుంది. ఈ ఫోన్ 128GB స్టోరేజ్, 6GB RAM తో వస్తుంది. కావాలంటే 2 TB వరకు పెంచుకోవచ్చు. 


Motorola G85

Motorola G85 5G ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. డిఫాల్ట్ గానే గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అంతేకాకుండా 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్టైలిష్ 3D కర్వ్డ్ పోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 CPU, 256GB స్టోరేజ్, 12GB RAM తో పనిచేసే ఈ ఫోన్ మంచి పనితీరును అందిస్తుంది.

50MP Sony LYTIA 600 కెమెరా ఫోటోగ్రఫీ అభిమానులను ఆకర్షిస్తుంది. Dolby Atmos డ్యూయల్ స్పీకర్లు, 5000 mAh బ్యాటరీ ఎక్కువ ఛార్జింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది.

Vivo T3

మీకు వేగంగా పనిచేసే ఫోన్ కావాలా? ఫోటోగ్రఫీ బాగుండాలని అనుకుంటున్నారా? అయితే మీరు Vivo T3 5Gని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. 50 MP Sony IMX882 సెన్సార్ OIS వల్ల తక్కువ కాంతిలో కూడా మీరు ఫోటోలు స్పష్టంగా తీయగలరు.

ఇందులో ట్విన్ స్టీరియో స్పీకర్లు, 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే మంచి డిస్ ప్లే ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తుంది. 44W ఛార్జింగ్ వల్ల ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఈ ఫోన్ కాస్ట్ రూ.18,499.

Nothing Phone 2a 

నథింగ్ ఫోన్ 2ఏ లో మీడియా టెక్ రూపొందించిన డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అమర్చారు. అందువల్ల పవర్ ఫుల్ పనితీరును అందిస్తుంది. ఇది 32MP ఫ్రంట్ కెమెరా, రెండు 50MP బ్యాక్ కెమెరాలు (OIS తో), 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. RAM బూస్టర్‌తో మల్టీ టాస్కింగ్ ఈజీగా చేయొచ్చు. ఇది 8GB RAM ను 20GB వరకు పెంచడానికి అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.17,999.

OnePlus Nord CE4 Lite (₹16,500)

OnePlus Nord CE4 Lite 5G ఫోన్  6.72 అంగుళాల బెస్ట్ స్క్రీన్ ను కలిగి ఉంది. 5500 mAh బ్యాటరీ, బలమైన 80W SUPERVOOC ఛార్జర్ వల్ల ఫోన్‌ ఎక్కువ సేపు పనిచేస్తుంది. ఇందులో మాక్రో లెన్స్, 2MP డెప్త్ అసిస్ట్ లెన్స్, EIS తో 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు తీసుకోవడానికి 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G CPU, Android 13.1 ఆధారంగా Oxygen OS తో పనిచేస్తుంది. అందువల్ల ఈ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!