4. హోం-బేస్డ్ ఫుడ్ బిజినెస్ (Home-Based Food Businesses)
ఈ కాలంలో ఆన్ లైన్ ఫుడ్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే క్లౌడ్ కిచెన్, టిఫిన్ సర్వీసులు, హోమ్ మేడ్ పికిల్స్, స్నాక్స్, లేదా బేకరీ ఐటమ్స్ తయారీ, కుకింగ్ క్లాసులు లేదా రెసిపీ ఈబుక్స్ వంటి ఆన్ లైన్ సర్వీసులు అందించి ఇంటి నుంచే మంచి ఆదాయం పొందవచ్చు.
5. ఆన్‌లైన్ విద్య (Online Education)
ఈ కాలంలో చదువు చాలా ఈజీ అయిపోయింది. కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రొఫెషనల్స్ ఆన్ లైన్ లోనే టీచింగ్ సేవలు అందిస్తున్నారు. అకాడెమిక్ లేదా పోటీ పరీక్షలకు ఆన్ లైన్ లో టీచింగ్ చేయడం, కోడింగ్, మ్యూజిక్, లాంగ్వేజ్ టీచింగ్ వంటి కోర్సులను ముందే తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. మీలో కూడా వీటిల్లో ఏ ఒక్క టాలెంట్ ఉన్నా ఇంటి నుంచే మంచి ఆదాయం సంపాదించొచ్చు.