మీ కారులో సోప్ ఉందా? కారులో సబ్బు ఉండటం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే..

Published : May 07, 2025, 12:52 PM IST

‘‘మీ కారులో సోప్ ఉందా?’’ మీ పేస్ట్ లో ఉప్పుందా? అని టూత్ పేస్ట్ యాడ్ లో అడిగినట్టు అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? కాని ప్రతి కారు యజమాని తన కారులో మస్ట్ గా సోప్ పెట్టుకోవాలి. ఎందుకు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.    

PREV
15
మీ కారులో సోప్ ఉందా? కారులో సబ్బు ఉండటం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే..

కారు లోపల ఎప్పుడూ ఫ్రెష్ నెస్ ఉండాలని, కారు శుభ్రంగా ఉండాలని ప్రతి కారు యజమాని కోరుకుంటారు. దానికి తగ్గట్టే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. అయితే ఎంత క్లీన్ చేసినా కొన్ని అత్యవసరాలు తీరేందుకు కారులో సబ్బు ఉంచుకోవడం మంచిది. కారులో సోప్ పెట్టుకోవడం అనేది ఒక చిన్న ఉపయోగకరమైన చిట్కా. ఇది శుభ్రత కోసం మాత్రమే కాకుండా, అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం రండి.
 

25

కారులో సబ్బు ఉంచడం వల్ల వచ్చే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

1. దుర్గంధాన్ని తొలగిస్తుంది

కారులోనే ఫుడ్ తినడం వల్ల కొంత అందులో పడిపోతుంది. దీంతో దుర్వాసన వస్తుంది. అలాగే తడిసిన బట్టలు కారులో వదిలేసినా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక పిల్లలు కారులో ఉంటే అదో ప్లే గ్రౌండ్ అయిపోతుంది. అందువల్ల కారులోపల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మంచి వాసన వచ్చే సబ్బును కారులో పెట్టుకోవాలి. ఇది ఎయిర్ ఫ్రెషనర్ లా పనిచేస్తుంది. 

సబ్బును ఓపెన్ చేసి పెట్టకుండా, సోప్ బాక్స్ లోనే ఉంచి దానికి హోల్స్ పెడితే సరిపోతుంది. లేదా సబ్బు ముక్కను చిన్న గాలి పోయే బ్యాగ్‌లో లేదా నెట్ పౌచ్‌లో ఉంచితే, వాసన పూర్తిగా విస్తరిస్తుంది. కారు ఇంటీరియర్ శుభ్రంగా, తాజాగా ఉంటుంది. 

35

2. అద్దాలు క్లీన్ చేసుకోవడానికి..

సాధారణంగా కారు అద్దాలకు బాగా డస్ట్ పడుతుంది. ఎంత క్లీన్ చేసినా మళ్లీ డర్టీగానే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే కారు అద్దాలు ఎంత తుడిచినా, వైపర్ వేసినా సరిగా క్లీన్ అవ్వవు. అలాంటి పరిస్థితుల్లో సోప్ ఉపయోగించుకొని కారు అద్దాలు క్లీన్ చేసుకుంటే విజన్ బాగుంటుంది.  ముఖ్యంగా సైడ్ మిర్రర్స్ పై సబ్బు రుద్ది శుభ్రంగా తుడిచేస్తే చాలా క్లీన్ గా అవుతాయి.  

45

3. తేమను అదుపు చేస్తుంది

కారు డోర్లు ఎప్పుడూ వేసి ఉండటం వల్ల కారులో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో కారులో తేమ చేరి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అందుకే కారులో సబ్బు ఉంచుకుంటే అది తేమను ఆకర్షించి కారు పొడి వాతావరణం ఉండేలా చేస్తుంది. 

చీమలు, ఈగలు వంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని రకాల సోప్ వాసనలు ఎలకలు, విషపూరిత తేళ్లు, పాములకు నచ్చదు. కారులో సోప్ ఉంటే ఇలాంటివి లోపలికి రాకుండా ఉంటాయి. 

55
Soap

4. సౌండ్స్ రాకుండా చేస్తుంది..

కారు వాడుతున్న కొద్దీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. డ్యాష్ బోర్డ్, డోర్లు సౌండ్ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కారులో ఉన్న సోప్ తీసుకొని సౌండ్ వచ్చే ప్రాంతంలో రాస్తే వెంటనే ఆగిపోతుంది.  

5. చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

సడన్ గా కారు పాడైతే దాన్ని బాగు చేసే క్రమంలో ఇంజిన్, టైర్లు, బానెట్ ఇలా ఎన్నో ముట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేతులు కడుక్కోవడానికి వీలుగా కారులో ఉన్న సోప్ ఉపయోగపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories