Upcoming 5G Mobiles: ఆగస్ట్ 2025 రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ 5G మొబైల్స్ చాలానే ఉన్నాయి. Pixel 10, Vivo V60, OPPO K13 Turbo Pro, Infinix GT 30 5G+, Realme P3 Pro, Poco M7 Plus, Redmi 15 వంటి ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు మీకోసం.
ఆగస్ట్ 2025 భారత మొబైల్ మార్కెట్‌లో పలు ప్రముఖ బ్రాండ్లు కొత్త 5G ఫోన్లను విడుదల చేయనున్నాయి. వివిధ ధరల శ్రేణుల్లో లభించనున్న ఈ డివైసులు వినియోగదారుల అవసరాలను బట్టి ప్రత్యేక ఫీచర్లతో వస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుంచి బడ్జెట్ ఫోన్ల వరకు త్వరలో విడుదల కానున్న ముఖ్యమైన ఫోన్ల వివరాలు మీ కోసం.
గూగుల్ పిక్సెల్ (Google Pixel) 10 సిరీస్
గూగుల్ పిక్సెల్ (Google Pixel) 10 సిరీస్‌లో నాలుగు మోడల్స్ ఉంటాయి. Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold.
ఈ ఫోన్లు TSMC తయారు చేసిన Tensor G5 చిప్‌తో పనిచేస్తాయి. ఇది వేగం, పవర్ ఎఫిషియెన్సీ విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది.
పిక్సెల్ 10లో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే, 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్, 10.8MP టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
Pro, XL మోడల్స్‌లో 16GB RAM వరకు ఉంటుంది. ఫోల్డబుల్ వర్షన్‌లో 6.4 అంగుళాల కవర్ స్క్రీన్, పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం.
DID YOU KNOW ?
గూగుల్ టెన్సర్ ప్రాసెసర్
గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ (Google Tensor Processor) అనేది గూగుల్ స్వయంగా రూపొందించిన మొబైల్ చిప్‌సెట్ (SoC – System on Chip). ఇది Pixel స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. Tensor (G1),G2, G3, G4 సిరీస్ లు వచ్చాయి. రాబోయే పిక్సెల్ 10 సిరీస్ లో Tensor G5 చిప్ సెట్ ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
25
వివో వీ60 (Vivo V60)
Vivo S30 భారత వెర్షన్‌గా Vivo V60 వస్తుంది.
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది.
6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది.
Zeiss భాగస్వామ్యంతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉంటుంది.
ఒప్పో కే13 టర్బో ప్రో (OPPO K13 Turbo Pro)
Snapdragon 8s Gen 4 ప్రాసెసర్, 16GB RAM, 1TB స్టోరేజ్, 7000mAh బ్యాటరీ, ఇంటర్నల్ ఫ్యాన్ కూలింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ధర సుమారుగా రూ. 30,000 ఉంటుంది.