
iQOO Z10R: ఎక్కువగా ఫెర్మార్మెన్స్, గేమింగ్ ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ లోకి ఫోన్లను తీసుకువచ్చే ఐక్యూ ఈ సారి అదిరిపోయే ఆల్ రౌండర్ ఫోన్ తీసుకొచ్చింది. అది కూడా 20 వేల లోపు బడ్జెట్ తో మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది.
భారతదేశంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన iQOO తన కొత్త మిడ్‌రేంజ్ 5G ఫోన్ iQOO Z10R ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ డివైస్ వినియోగదారులకు ఆధునిక ఫీచర్లను సరసమైన ధరకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ. 19,499 కాగా, ఇతర ఆఫర్లతో మరింత తక్కువ ధరకే పొందవచ్చు.
iQOO Z10R మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఫీచర్లను అందించే ఓ శక్తివంతమైన ఎంపికగా నిలుస్తుంది. అత్యాధునిక కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీతో ఈ ఫోన్ విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులతో పాటు లైట్ గేమింగ్ ప్రియులకు కూడా మంచి ఎంపికగా ఉంది. ఐక్యూ జె10 ఆర్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
iQOO Z10R లో 6.77 అంగుళాల క్వాడ్ కర్వుడ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది FHD+ (2392x1080) రెజల్యూషన్ కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే, Schott Xensation Alpha గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చింది. ఈ ఫోన్ ఆక్వామరైన్, మూన్‌స్టోన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
iQOO Z10R మీడియా టెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 7400 5G చిప్‌సెట్ (4nm ఫాబ్రికేషన్) ను కలిగి ఉంది. ఇది 8GB, 12GB LPDDR4X RAM వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా 128GB, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంది. సాధారణ వినియోగం, కంటెంట్ చూడటం, లైట్ గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు మంచి ఎంపికగా ఉంది.
ఐక్యూ జెడ్ 10 ఆర్ వెనుక భాగంలో 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS తో), 2MP డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్ తో ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ముందు, వెనుక రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేయడం దీని ప్రత్యేకత.
Aura Light ఫీచర్ ద్వారా రాత్రి ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కంటెంట్ క్రియేటర్లకు, ఫోటోలు, వీడియోలు తీయడం ఇష్టపడే వారికి ఈ ప్రైస్ ధరలో మంచి ఎంపిక ఇది.
iQOO Z10R లో 5700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. ఫోన్‌ను 33 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. గేమింగ్ సమయంలో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ సహాయపడుతుంది. దీని వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒక రోజంతా కూడా మీరు ఛార్జ్ చేయకుండా ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 తో రన్ అవుతుంది. ఇందులో AI Note Assist, Circle to Search, AI Erase 2.0, AI Screen Translation, Photo Enhance, AI Transcript Assist వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ చెబుతున్నదాని ప్రకారం 2 సంవత్సరాలు OS అప్‌గ్రేడ్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి.
iQOO Z10R ప్రస్తుతం భారతదేశంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart), అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,499 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.