మీ సిబిల్ స్కోరు తక్కువగా ఉందా? ఈ 7 చిట్కాలు పాటించారో 700+ కు చేరుకోవడం ఖాయం

Published : Aug 08, 2025, 10:48 PM IST

మీ సిబిల్ స్కోరు తక్కువగా ఉందా? అయితే ఆర్థిక నిపుణులు సూచిస్తున్న ఈ 7 టిప్స్ పాటిస్తే మీ సిబిల్ స్కోరు 700+ కావడం ఖాయం. అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
15
మీ సిబిల్ స్కోరు పెంచుకోండిలా...

ప్రతి ఒక్కరికీ మంచి సిబిల్ (CIBIL) స్కోరు కలిగి ఉండటం చాలా ముఖ్యం. అధిక స్కోరు ఉన్నవారికి బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీతో, వేగంగా లభిస్తాయి. కానీ తక్కువ సిబిల్ స్కోరు ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో రుణాలు పొందడం కష్టమవుతుంది. అన్ని బ్యాంకులు ఇప్పుడు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల జారీకి దరఖాస్తుదారుల సిబిల్ స్కోరును తప్పనిసరిగా పరిశీలిస్తాయి. సాధారణంగా 700 పైగా స్కోరు అత్యుత్తమంగా పరిగణించబడుతుంది.

DID YOU KNOW ?
సిబిల్ స్కోర్ అంటే?
సిబిల్ స్కోర్ అంటే ఓ వ్యక్తి ఆర్థిక వ్యవహారాల గురించి తెలియజేసే మూడంకెల సంఖ్య. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) దీని పూర్తి రూపం.
25
సిబిల్ స్కోరు త్వరగా ఎలా మెరుగుపరుచుకోవాలి?

ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం క్రమం తప్పకుండా ఈ 7 స్మార్ట్ పద్ధతులను పాటిస్తే సిబిల్ స్కోరు మెరుగవుతుంది.

1. సమయానికి బకాయిలు చెల్లించండి

EMI లేదా క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు ఆలస్యం చేయడం స్కోరును తగ్గిస్తుంది. ఆటోమేటిక్ బిల్ పేమెంట్ సేవలను ఉపయోగించడం మంచిది… లేదంటే సమయానికి అన్ని బిల్లులు చెల్లిస్తూ ఉండాలి. 

35
2. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవద్దు

ఒక రుణాన్ని పూర్తిగా తీర్చినతర్వాతే మరొక రుణం తీసుకోవాలి. ఒకేసారి పలు రుణాలు తీసుకోవడం ఆర్థిక ఇబ్బందుల సంకేతంగా పరిగణించబడుతుంది.

3. హెల్తీ క్రెడిట్ మిక్స్

హోమ్ లోన్, ఆటో లోన్ వంటి సెక్యూర్డ్ రుణాలు... వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి అన్‌సెక్యూర్డ్ రుణాల సరైన పరిమాణంలో ఉండేలా చూసుకొండి. హెల్తీ క్రెడిట్ మిక్స్ మీ సిబిల్ స్కోరు పెంచుతుంది.

45
4. అవసరమైనప్పుడే కొత్త క్రెడిట్ తీసుకోండి

అవసరం లేనప్పుడు రుణాలు లేదా క్రెడిట్ కార్డులు తీసుకోవద్దు. అధిక రుణభారం స్కోరును ప్రభావితం చేస్తుంది.

5. జాయింట్ అకౌంట్స్‌ను పర్యవేక్షించండి

జాయింట్ ఖాతాలు, గ్యారంటీ ఖాతాల్లో ఇతరుల చెల్లింపు లోపాలు మీ స్కోరుపై ప్రభావం చూపుతాయి.

55
6. సిబిల్ రిపోర్ట్‌ను తరచుగా తనిఖీ చేయండి

తప్పులు లేదా అప్డేట్ కాని రుణ సమాచారం స్కోరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ సిబిల్ రిపోర్టును తనిఖీ చేసుకుంటూ తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోండి.

7. మంచి క్రెడిట్ హిస్టరీని క్రమంగా నిర్మించండి

ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్నప్పటికీ తక్కువ వాడకం స్కోరును పెంచుతుంది. దీర్ఘకాల రుణాల ద్వారా తక్కువ EMI ఉంచడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories