కోల్‌గేట్‌, క్లోజ్అప్‌, ఓరల్‌-బీ.. ఇవన్నీ భారతదేశానికి చెందిన బ్రాండ్లు అనుకుంటున్నారా.?

Published : Nov 01, 2026, 02:52 PM IST

Toothpaste: ఉదయం నిద్రలేవగానే మొద‌ట చేసే ప‌ని బ్రష్‌పై టూత్‌పేస్ట్ వేయ‌డం. మన ఇళ్లలో ఎక్కువగా కనిపించే బ్రాండ్లలో కోల్‌గేట్‌, క్లోజ్అప్‌, ఓరల్‌-బీ ముఖ్యమైనవి. అయితే మ‌న‌లో చాలా మంది ఇవి భార‌తీయ బ్రాండ్‌లా భావిస్తారు. కానీ ఇవి మ‌న‌వి కావ‌ని తెలుసా?

PREV
15
కోల్‌గేట్‌.. సబ్బుల వ్యాపారం నుంచి టూత్‌పేస్ట్‌ వరకు

అమెరికాలో విలియం కోల్‌గేట్‌ 1806లో సబ్బులు, కొవ్వొత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. 1873లో కోల్‌గేట్‌ టూత్‌పేస్ట్‌ను జాడీల్లో విక్రయించడం మొదలుపెట్టింది. 1896లో ట్యూబ్‌ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో 1937లో అడుగుపెట్టిన ఈ బ్రాండ్‌.. విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, ప్రకటనలతో క్రమంగా ప్రజలకు చేరువైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిచయం, వినియోగదారుల నమ్మకం దీనికి బలంగా మారాయి.

25
క్లోజ్అప్‌.. యువతను ఆకర్షించిన జెల్‌ టూత్‌పేస్ట్‌

1967లో అమెరికాలో ప్రారంభమైన క్లోజ్అప్‌.. సాధారణ టూత్‌పేస్ట్‌లకు భిన్నంగా జెల్‌ రూపంలో మార్కెట్‌లోకి వచ్చింది. తాజా శ్వాస, ఆత్మవిశ్వాసం వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేసింది. ముఖ్యంగా యువతను ఆకర్షించే ప్రకటనలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ బ్రిటన్‌కు చెందిన యూనిలీవర్‌ సంస్థ పరిధిలో ఉంది.

35
ఓరల్‌-బీ.. టూత్‌బ్రష్‌తో మొదలైన ప్రయాణం

అమెరికాకు చెందిన దంతవైద్యుడు డాక్టర్‌ రాబర్ట్‌ హట్సన్‌ 1949 చిర‌ర్లో ఓరల్‌-బీ బ్రాండ్‌ను ప్రారంభించారు. మృదువైన నైలాన్‌ పీచులతో టూత్‌బ్రష్‌లను రూపొందించడం ద్వారా గుర్తింపు పొందింది. 1984లో గిలెట్‌ సంస్థ ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. అనంతరం ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (P&G) పరిధిలోకి చేరింది. ప్రస్తుతం సాధారణ బ్రష్‌లతో పాటు ఎలక్ట్రిక్‌ బ్రష్‌లు వంటి దంత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది.

45
భారతదేశంలో ఇంతలా ఎలా పాతుకుపోయాయి?

ఈ బ్రాండ్ల విజయానికి ప్రధాన కారణం విస్తృతమైన మార్కెటింగ్‌, సులభమైన లభ్యత. నగరాల నుంచి గ్రామాల వరకు దుకాణాల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. టెలివిజన్‌ ప్రకటనలు, బ్రాండ్‌ ప్రచారాలతో వినియోగదారులకు చేరువయ్యాయి. నోటి పరిశుభ్రతపై అవగాహన పెరగడం కూడా వీటి మార్కెట్‌ విస్తరణకు తోడ్పడింది.

55
వీటి వ్యాపార విజయ రహస్యం ఏమిటి?

వినియోగదారుల నమ్మకం, ప్రత్యేకమైన బ్రాండ్‌ గుర్తింపు, విస్తృతమైన పంపిణీ వ్యవస్థ ఈ కంపెనీల విజయానికి కీలకం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, వివిధ ధరలు, పరిమాణాల్లో ఎంపికలు అందించడం ద్వారా ఎక్కువ మందికి చేరువయ్యాయి. అయితే కోల్‌గేట్‌, క్లోజ్అప్‌, ఓరల్‌-బీ అన్నీ ఒకే సంస్థకు చెందినవి కావు. వాటి యాజమాన్యాలు వేర్వేరు. విదేశాల్లో పుట్టిన బ్రాండ్లు కూడా స్థానిక మార్కెట్‌ను అర్థం చేసుకుని, వినియోగదారుల నమ్మకాన్ని సంపాదిస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చో వీటి ప్రయాణం నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories