గ్రాస్‌బెర్గ్ గని నుంచి వెలికితీసే ఖనిజంలో బంగారం, రాగి, వెండి అధికంగా తీస్తారు. పపువాలోని ఎత్తయిన పర్వతం పున్‌కాక్ జయ. దీనికి సమీపంలోనే ఈ గని ఉంది. టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రాంతం మొత్తం ఏర్పడింది. ఈ భారీ గనిలో సుమారు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ గనికి సొంతంగా విమానాశ్రయం, ఓడరేవు కూడా ఉన్నాయి. ఇక్కడ్నించి బంగారాన్ని, వెండిని, రాగిని తరలించాలంటే ఇలాంటి రవాణా సదుపాయాలు చాలా అవసరం. అంతేకాదు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులను కూడా నిర్మించారు.
గ్రాస్‌బెర్గ్ గని చరిత్ర చూస్తే 1936లో దీన్ని మొదటిసారి కనిపెట్టినట్టు చెబుతారు. డచ్ దేశానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డోజీ ఇక్కడి ఖనిజ నిక్షేపాలను మొదటిసారి కనుగొన్నారు. 1960లలో ఫ్రీపోర్ట్మె క్‌మొరాన్ అనే సంస్థ ఇక్కడ ఖనిజాలు తవ్వేందుకు లైసెన్స్ పొందింది. 2023లో ఈ గని నుంచి ఏకంగా 52.9 టన్నుల బంగారం, 6,80,000 టన్నుల రాగి, 190 టన్నుల వెండిని వెలికి తీశార.