విచారణలు, సూచనలు, లోపాల సవరణలతో కూడిన కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిలో 23 అధ్యాయాలు, 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా చిన్న మినహాయింపులు, స్పష్టమైన విధానాలతో రూపొందించారని సమాచారం. పాత బిల్లులోని ముసాయిదా లోపాలు, భాషా దోషాలను సవరించి, కొత్త పద్ధతులను సమర్పించేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఈ కొత్త బిల్లుతో, పన్ను చెల్లింపు వ్యవస్థను మరింత సుస్పష్టం చేసి, డిజిటల్ ఆధారితంగా మానవ జోక్యం తగ్గించి, ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రజలకు దగ్గర చేయాలన్నది కేంద్ర లక్ష్యంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.