ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈవీ వాహనలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా ఈవీ కార్లలో ఎక్కువ ఆదరణ లభిస్తున్న టాటా పంచ్ ఈవీ డౌన్‌పేమెంట్, ఈఎమ్ఐ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే టాటా మోటార్స్ తరచూ కొత్త EV మోడల్స్ అందిస్తోంది. ఈ క్రమంలో “Tata Punch EV” అనే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV వినియోగదారుల్ని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో మంచి మైలేజ్, బాటరీ సామర్థ్యం వంటి కీలక విషయాల్లో పంచ్ ఈవీ దూసుకుపోతోంది.
25
టాటా Punch EV ధర ఎంత?
టాటా Punch EV ఆన్-రోడ్ ధర సుమారు రూ. 10.45 లక్షలు ఉంది. అయితే ఈ ధర రాష్ట్రం, డీలర్ ఆధారంగా మారే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఈ కారును రూ. 40 వేల డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకుంటే 4 సంవత్సరాల పాటు 9.8 శాతం వడ్డీరేటుతో నెలకు సుమారు రూ. 25,395 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. మీకు ఈ లోన్ ఆమోదం, మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది.
35
పవర్‌ఫుల్ బ్యాటరీ, ఛార్జింగ్ వ్యవస్థ
పంచ్ ఈవీలో 25 kWh సామర్థ్యం ఉన్న లిథియం-ఆయన్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది AC ఛార్జర్ ద్వారా 3.6 గంటల్లో 10% నుంచి 100% వరకు ఛార్జ్ అవుతుంది. అదే బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 56 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీన్ని రోజువారీ ప్రయాణాలకు సులభంగా ఉపయోగించవచ్చు.
పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఈ కార్ 315 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది. అంతేకాకుండా, ఇది గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో అందుకుంటుంది.
55
బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ SUV
Tata Punch EV, భారతీయ మార్కెట్‌కి అద్భుతమైన ఎలక్ట్రిక్ SUVగా నిలుస్తోంది. ధర, మైలేజ్, సేఫ్టీ, వేగం వంటి అన్ని ప్రధాన అంశాలలో ఇది గట్టి పోటీదారిగా మారింది. ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవాళ్లకు ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.