Creditcard: క్రెడిట్ కార్డున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ఆ బిల్లు ఎవ‌రు చెల్లించాలి? చ‌ట్టం ఏం చెబుతోంది.?

Published : Jun 26, 2025, 11:37 AM ISTUpdated : Jun 26, 2025, 11:38 AM IST

ప్ర‌స్తుతం బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి వ‌ద్ద క్రెడిట్ కార్డు ఉంటోంది. అయితే మ‌న‌లో చాలా మందికి క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివ‌రాలు తెలియ‌వు. అలాంటి ఒక దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం

ఇటీవల కాలంలో నగరాల్లో యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే సమయంలో వీటి వినియోగం పెరిగింది. ఆర్థిక అవ‌స‌రాల‌ను తీరుస్తున్న క్రెడిట్ కార్డుల‌ను స‌రిగ్గా వినియోగించుకుంటేనే మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తూనే ఉంటారు.

ఒకసారి క్రెడిట్ కార్డుల వాడకానికి అలవాటయ్యాక దాని నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. క్రెడిట్ కార్డులో ల‌క్ష‌ల ల‌క్ష‌లు లిమిట్ ఉన్నా అవి మ‌న డ‌బ్బులు కాద‌నే విష‌యాన్ని గుర్తించాలి. అది కేవ‌లం ఒక రుణం లాంటిదేన‌ని మ‌ర్చిపోకూడ‌దు.

25
క్రెడిట్ కార్డుతో లాభాలేంటి.?

అయితే క్రెడిట్ కార్డుతో లాభాలు లేవా అంటే క‌చ్చితంగా ఉన్నాయి. ఇందులో ప్ర‌ధాన‌మైంది “గ్రేస్ పీరియడ్”. ఇది ఒక నిర్దిష్ట సమయం వరకూ రుణంపై వడ్డీ లేకుండా చెల్లించుకునే అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఆ పీరియడ్ దాటి బకాయి ఉంటే, బ్యాంకులు భారీ వడ్డీ వసూలు చేస్తాయి. వాస్తవానికి చిన్న మొత్తాన్ని ఆలస్యం చేస్తేనే, నెలలకే అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది.

35
అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ల బాధ్యత ఎవరిది?

చాలా మంది ఉపయోగించే క్రెడిట్ కార్డులు "అన్‌సెక్యూర్డ్" రుణాలుగా ప‌రిగ‌ణిస్తారు. అంటే ఎలాంటి పూచీక‌త్తు లేకుండా స‌ద‌రు వ్య‌క్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ కార్డులు ఇస్తారు. ఈ తరహా కార్డ్ హోల్డర్ మరణిస్తే, సాధారణంగా అతని కుటుంబసభ్యులకు రుణ భారం పడదు. క్రెడిట్ కార్డ్ అప్పు వ్యక్తిగత బాధ్యత కాబట్టి, వినియోగదారు మరణించిన తర్వాత బ్యాంకు ఆ మొత్తం రికవరీ చేయలేనిచో దానిని రద్దు చేస్తుంది.

45
ఆస్తి ఉంటే బ్యాంకు ప్రయత్నిస్తుంది

అయితే, వినియోగదారు మరణించిన తర్వాత ఆయన పేరిట ఏవైనా ఆస్తులు, డిపాజిట్లు, లేదా బ్యాలెన్స్ ఉంటే, బ్యాంకులకు చట్టబద్ధంగా వాటిని క్లెయిమ్ చేసుకునే హ‌క్కు ఉంటుంది. ఇక ఆస్తి లేదంటే బ్యాంకులే ఆ మొత్తాన్ని భ‌రిస్తాయి.

55
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల్లో ఏం జరుగుతుంది?

ఇక సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల విషయంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఫిక్సడ్ డిపాజిట్ (FD) ఆధారంగా ఇస్తారు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి, లేదా నిరంతర ఆదాయం లేనివారికి బ్యాంకులు FDను బేస్‌గా తీసుకుని కార్డు ఇస్తాయి.

 వినియోగదారు మరణించినపుడు, బకాయిలను ఆ FD నుండి డైరెక్ట్‌గా తీసేసి, మిగిలిన డబ్బు వారసులకు ఇస్తారు. అందువల్ల ఇందులో రుణం మాఫీ అనే అవకాశం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories