IBM: కొంపముంచిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్: టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎంలో వేలల్లో ఉద్యోగాల కోత

Published : May 28, 2025, 05:28 PM IST

అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం లో భారీగా ఉద్యోగాల కోత జరిగింది. ప్రపంచంలో టాప్ కంపెనీల్లో ఒకటైనా ఐబీఎం ఉద్యోగులను తీసేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ అనే నిపుణులు చెబుతున్నారు.

PREV
15
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్లే..

అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ ఐబిఎం (IBM) 8000 మంది ఉద్యోగులను తొలగించిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
AI చేతికి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌..

ఐబీఎం కంపెనీలో హెచ్ఆర్ విభాగం బాధ్యతలను కొన్ని నెలల క్రితం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి అప్పగించారు. కంపెనీ అనుకున్న దానికంటే మంచిగా రిజల్ట్ రావడంతో ఐబీఎం ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించుకుంది. ఇందులో హెచ్‌ఆర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగుల కోత ఎక్కువగా జరిగినట్లు సమాచారం.

ఆఫీస్ పనులను కృత్రిమ మేధస్సుతో కలిపే ప్రక్రియలో భాగంగానే మానవ వనరుల విభాగంలో (HR Department) పనిచేసే వారి ఉద్యోగాలు పోయాయని బిజినెస్ టుడే వార్తల్లో పేర్కొంది.

35
హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో 200 మంది తొలగింపు

పరిపాలనా పనులు చేసే 200 మంది హెచ్ఆర్ లను తొలగించి వారి స్థానంలో ఈ నెల ప్రారంభంలో AI ఏజెంట్లను నియమించింది ఐబీఎం. ఉద్యోగుల అభ్యర్థనలకు సమాధానం చెప్పడం, పేపర్ వర్క్ చేయడం, హెచ్ఆర్ డేటాను సేకరించడం వంటి పనులు AI చేస్తుంది. ఈ పనులు చేసే సాఫ్ట్‌వేర్ ఆధారిత AI ఏజెంట్లను పర్యవేక్షించడానికి కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే కంపెనీకి అవసరం. ఐబీఎంలో మరికొన్ని విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడం వల్ల కంపెనీ నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయని ఐబీఎం అంచనా వేస్తోంది.

45
ఇది ఆటోమేషన్.. ఉద్యోగుల తొలగింపు కాదు..

ఐబీఎం ఆటోమేషన్ పై దృష్టి పెడుతుందని కంపెనీ CEO అరవింద్ కృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐబీఎంలో AI, ఆటోమేషన్ చాలా చురుగ్గా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఐబీఎం ఉద్యోగులను తొలగించడం లేదని, కంపెనీని ఆధునీకరిస్తున్నామని అరవింద్ కృష్ణ అన్నారు. ఐబీఎంలో వివిధ విభాగాల్లో సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించారని సమాచారం.

55
ఇప్పటికే 61,000 ఉద్యోగుల తొలగింపు..

2025 లో టెక్ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా పోతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. 2025 లో ఐదు నెలల్లోనే టెక్ రంగంలో 61,000 ఉద్యోగాలు పోయాయని వార్తలు వచ్చాయి. ఇది పెద్ద టెక్ కంపెనీల లెక్క మాత్రమే. వీటితో పాటు చిన్న కంపెనీలు, స్టార్టప్ లు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ చర్యలు చూస్తుంటే కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుత ఉద్యోగ విధానాన్ని మారుస్తుందనే ఆందోళన పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ ఇటీవల 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

Read more Photos on
click me!

Recommended Stories