నవరాత్రి పండుగ వచ్చేసింది. అలాగే జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో (Stocks) కొత్త పెట్టుబడి అవకాశాలు అధికంగా పెరుగుతాయి. ఏ షేర్లు కొంటే ఎక్కువ లాభాలు పొందవచ్చో తెలుసుకోండి.
ప్రతి ఏడాది నవరాత్రుల సమయంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంటుంది. ఈ సమయంలోనే స్టాక్ మార్కెట్లో చాలామంది పెట్టుబడి పెట్టే అవకాశాలు పెరుగుతాయి. ఇటీవల ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల కూడా నవరాత్రుల సమయంలో స్టాక్ మార్కెట్ జోరుమీదుంటుంది . దీన్ని నిపుణులు కొత్త పెట్టుబడికి సరైన సమయమని చెబుతారు. నవరాత్రి సమయంలో సరైన షేర్లను ఎంచుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో బలపడుతుందని వారు భావిస్తున్నారు.
24
లాభాలనిచ్చే షేర్లు ఇవే
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన గౌరవ్ షా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు ఏడాది టార్గెట్ ధర రూ.1,300గా అంచనా వేసి సిఫార్సు చేశారు. మంచి వర్షపాతం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. అలాగే రామ్కో సిమెంట్ (టార్గెట్ ధర రూ.1,275), పీబీ ఫిన్‌టెక్ (టార్గెట్ ధర రూ.2,200)లో కూడా పెట్టుబడి పెట్టవచ్చని చెప్పారు.
34
నిపుణుల సిఫార్సులు
చోళా సెక్యూరిటీస్‌కు చెందిన ధర్మేష్ కాంత్, టాటా టెక్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఫెడరల్ బ్యాంక్‌లను సిఫార్సు చేశారు. టాటా టెక్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చే ఏడాదిలో 15-20% లాభం ఇవ్వొచ్చని ఆయన అంటున్నారు. ఫెడరల్ బ్యాంక్‌లో కూడా పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
మార్కెట్‌స్మిత్ ఇండియాకు చెందిన మయూరేష్ జోషి, సర్దా ఎనర్జీ (24% లాభం), లెమన్ ట్రీ హోటల్స్ (20% లాభం), అపోలో హాస్పిటల్స్ (21% లాభం) తన ఎంపికగా చెప్పారు. ముఖ్యంగా లెమన్ ట్రీ హోటల్స్ తన హోటల్ వ్యాపారాన్ని విదేశాల్లోనూ విస్తరిస్తుండటంతో EBITDA నిష్పత్తి మెరుగుపడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఇది పెట్టుబడి సలహా కాదు. పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడి అభిప్రాయం తీసుకోండి.