ఈ ఆఫర్ తర్వాత, ఓలా తన రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలను కొనసాగిస్తుంది. అందులో S1 ప్రో+ (5.2kWh, 4kWh) ధరలు రూ.1,69,999, రూ.1,51,999గా ఉన్నాయి. S1 ప్రో (4kWh, 3kWh) ధరలు రూ.1,37,999, రూ.1,20,999గా ఉన్నాయి. సాధారణ ప్రజల కోసం S1 X+ (4kWh) రూ.1,11,999కి, S1 X సిరీస్ (2kWh, 3kWh, 4kWh) రూ.81,999 నుంచి రూ.1,03,999 వరకు ధరలను నిర్ణయించారు.