Stock market: రోడ్డుపై కారు వెళ్లిన ప్ర‌తీసారి మీకు డ‌బ్బులు వ‌స్తాయి.. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి తెలుసా?

Published : Jan 27, 2026, 04:39 PM IST

Stock market: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్ర‌భుత్వం నిర్మించే ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంటే భారీగా లాభాలు పొందొచ్చు కదూ.అలాంటి ఓ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
InvITs అంటే ఏమిటి?

InvITs అంటే Infrastructure Investment Trusts. ఇవి మ్యూచువల్ ఫండ్స్ తరహాలో పనిచేసే పెట్టుబడి సాధనాలు. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI ఆధ్వర్యంలో ఇవి నడుస్తాయి. InvITs ద్వారా సాధారణ పెట్టుబడిదారులు రోడ్లు, హైవేలు, విద్యుత్ ప్రాజెక్టులు, గ్యాస్ పైపులైన్లు లాంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టగలరు. ఈ ట్రస్టుల యూనిట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్టింగ్ అవుతాయి. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును ఆదాయం తెచ్చే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టి, వచ్చిన నగదు ఆదాయాన్ని పెట్టుబడిదారులకు పంచుతారు.

25
InvITలో రకాలు

InvITs ప్రధానంగా రెండు విధాలుగా ఉంటాయి.

ఆదాయం వచ్చే పూర్తి అయిన ప్రాజెక్టులు:

ఇవి ఇప్పటికే పని చేస్తున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతాయి. టోల్ రోడ్లు, విద్యుత్ లైన్లు లాంటి వాటి నుంచి నేరుగా ఆదాయం వస్తుంది. ఈ రకం InvITs సాధారణంగా పబ్లిక్ ఆఫర్ ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తాయి.

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు:

ఇవి ఇంకా పూర్తి కాని ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతాయి. ఈ యూనిట్లు ఎక్కువగా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జారీ అవుతాయి. రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది.

35
భారతదేశంలో InvITs నిర్మాణం

InvIT ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేస్తారు. SEBI వద్ద నమోదు తప్పనిసరి. InvIT వ్యవస్థలో నాలుగు కీలక భాగాలు ఉంటాయి.

స్పాన్సర్ – ట్రస్ట్‌ను ప్రారంభించే సంస్థ

ట్రస్టీ – పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే సంస్థ

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ – ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత

ప్రాజెక్ట్ ఆస్తులు – రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు లాంటి ఆదాయం ఇచ్చే వసతులు

ఈ నిర్మాణం వల్ల పెట్టుబడుల నిర్వహణ పద్ధతిగా సాగుతుంది.

45
InvITs లాభాలు, న‌ష్టాలు

లాభాలు:

ఒకే పెట్టుబడితో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం. స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం. యూనిట్లు ఎక్స్చేంజ్‌లో కొనుగోలు, విక్రయం చేయవచ్చు. నిపుణుల చేత ఆస్తుల నిర్వహణ ఉంటుంది. SEBI నిబంధనల ప్రకారం InvITs తమ నికర నగదు ఆదాయంలో 90 శాతం పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలి.

న‌ష్టాలు:

ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తే ప్రభావం ప‌డే అవ‌కాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఖర్చులు పెరగడం. ప్రాజెక్టులు ఆలస్యం అయితే ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది.

55
ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు.?

InvITs ఐపీవో ద్వారా కూడా వస్తాయి. కనీస పెట్టుబడి మొత్తం సాధారణంగా రూ. 10 లక్షలు ఉంటుంది. అందుకే ఎక్కువగా హై నెట్ వర్త్ వ్యక్తులు, సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తారు. దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యం ఉన్నవారు, స్థిర ఆదాయం కోరుకునేవారు, కొంత రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి InvITs సరిపోతాయి. పెట్టుబడి పెట్టేముందు వ్యక్తిగత ఆర్థిక స్థితి, రిస్క్ భరించే శక్తి, పెట్టుబడి కాలాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

Read more Photos on
click me!

Recommended Stories