ప్రపంచంలోనే తోపు బ్యాంకుల్లో మన దేశ బ్యాంకుకు స్థానం, ఎంతో అరుదైన గౌరవం

Published : Oct 24, 2025, 03:47 PM IST

SBI Bank: ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. వాటిల్లో అత్యుత్తమ బ్యాంకులను ఎంపిక చేశారు. ఆ ఉత్తమ బ్యాంకుల్లో మన దేశానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా అరుదైన గౌరవం దక్కింది. 

PREV
15
ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐ

భారతదేశంలోని అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. న్యూయార్క్ లోని గ్లోబల్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ నుండి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలకు చెందిన వార్షిక సమావేశాలు సందర్భంగా గ్లోబల్ ఫైనాన్స్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ప్రపంచంలోనే ఉత్తమ వినియోగదారుల బ్యాంక్ గా ఎస్‌బీఐ గుర్తింపు పొందింది. అలాగే భారతదేశంలోనే ఉత్తమ బ్యాంకుగా కూడా అవార్డును సాధించింది.

25
అవార్డులపై ఆనందం

ఈ రెండు అవార్డులను అందుకోవడం పై బ్యాంకు సిబ్బంది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అవార్డులు ఎస్‌బీఐ కి రావడం అనేది ప్రపంచంలోనే బలమైన స్థానాన్ని చూపిస్తోందని.. అలాగే అత్యుత్తమ కస్టమర్ సేవలను అందించడంలో తమ నిబద్ధతను కూడా ప్రతిబింబిస్తోందని పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు తాము చేసిన కృషికి ఫలితం ఇదని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.

35
52 కోట్ల మంది కస్టమర్లు

ఈ రెండు ప్రపంచ స్థాయి అవార్డులు రావడం పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు ప్రెసిడెంట్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. గ్లోబల్ ఫైనాన్స్ ఎస్‌బీఐ బ్యాంకును గుర్తించడం తమకు ఎంతో గౌరవాన్ని అందించిందని చెప్పారు. 52 కోట్ల మంది కస్టమర్లకు సేవ చేస్తూ, రోజుకు 65 వేల మంది కొత్త కస్టమర్లను సాధించడం సాధారణమైన విషయం కాదని అన్నారు. తన మొబైల్ అప్లికేషన్ కు 100 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారని, 10 మిలియన్ల మంది రోజువారి యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఆయన తెలిపారు.

45
అతి పెద్ద వాణిజ్య బ్యాంకు ఇదే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా గుర్తింపు పొందింది. బ్యాంకుకున్న ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగులు కూడా అధికమే. అంతే కాదు మన దేశంలో అతి పెద్ద గృహ రుణ దాతగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంకు దగ్గర రుణాలను తీసుకొని 30 లక్షల మంది తమ సొంత ఇంటి కలలను నిజం చేసుకున్నారు.

55
ఎస్‌బీఐకి ఎన్ని బ్రాంచీలు?

ఎస్‌బీఐకి మనదేశంలో 22,980 శాఖలు ఉన్నాయి. ఇక ఏటీఎంలు 62,200 ఉన్నాయి. ఇక బిజినెస్ కరస్పాండెంట్ అవుట్ లెట్లు 76,800 దాకా ఉన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 142 మిలియన్ల మందికి సేవలు అందిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories