Bank Rules: బ్యాంకులో డబ్బు జమ చేయడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే మనీ డిపాజిట్ చేయడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా.? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకులో మీరు ఎంత డబ్బైనా జమ చేయవచ్చు. కానీ రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు జమ చేయాలనుకుంటే, తప్పనిసరిగా పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. ఈ నియమం వల్ల బ్యాంకులు అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను రికార్డు చేస్తాయి. అవసరమైతే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి. అందువల్ల, పెద్ద మొత్తంలో నగదు జమ చేయాలనుకునే వారు గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లడం అవసరం
25
పొదుపు ఖాతా వార్షిక పరిమితి రూ. 10 లక్షలు
మీ సేవింగ్స్ అకౌంట్‌లో సంవత్సరానికి రూ. 10 లక్షలకు పైగా నగదు జమ అయితే, బ్యాంక్ స్వయంగా ఆ వివరాలను పన్ను శాఖకు నివేదిస్తుంది. ఇది చట్టవిరుద్ధం కాదు కానీ, మీరు జమ చేసిన డబ్బు మూలం స్పష్టంగా చూపించలేకపోతే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. జీతం, వ్యాపారం లేదా ఇతర చట్టబద్ధమైన ఆదాయం అని ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అకౌంటింగ్ లేకుండా పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేస్తే ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించవచ్చు.
35
కరెంట్ ఖాతాలకు వేరే నియమాలు
వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి వృత్తిదారులు ఎక్కువగా కరెంట్ ఖాతాలను ఉపయోగిస్తారు. వారి కోసం డిపాజిట్ పరిమితి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ నగదు కరెంట్ అకౌంట్‌లో జమ అయితే, బ్యాంకు దానిని కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుంది. ఇది కూడా ఒక రిపోర్టింగ్ పరిమితి మాత్రమే, కానీ ఇంత మొత్తాన్ని మించితే మీ ఇన్‌కమ్ సోర్స్‌ను స్పష్టంగా చూపించాలి.
ఇప్పుడు చాలా మంది కేవలం బ్యాంకుల్లోనే కాకుండా.. CDM (Cash Deposit Machine) లేదా ATM ద్వారా డబ్బు జమ చేస్తున్నారు. బ్యాంకు ప్రకారం ఈ యంత్రాలకూ రోజువారీ పరిమితులు ఉంటాయి.
* SBI ATM లేదా CDM ద్వారా రోజుకు రూ. 2 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు.
* HDFC బ్యాంక్‌లో కూడా రూ. 2 లక్షల వరకు రోజువారీ డిపాజిట్ పరిమితి ఉంది. ఈ పరిమితులు బ్యాంకు భద్రతా విధానాల ప్రకారం మారవచ్చు.
55
ఆదాయపు పన్ను శాఖ ఎందుకు పర్యవేక్షిస్తుంది?
పన్ను శాఖ ఉద్దేశ్యం చిన్న డిపాజిట్లను జరిమానా వేయడం కాదు. ముఖ్యంగా లెక్కల్లో చూపని నిధులు, నల్లధనం లావాదేవీలు గుర్తించడం కోసం మాత్రమే పర్యవేక్షణ ఉంటుంది. మీ డిపాజిట్లు ఒక నిర్దిష్ట పరిమితిని మించినప్పుడు, వారు నిధుల మూలాన్ని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన పత్రాలు.. శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్, వ్యాపార రసీదులు వంటివి ఉంటే ఎలాంటి భయం ఉండదు.