ఈ పెన్ను ధ‌ర రూ. 25 వేలు.. ప్ర‌తీ రోజూ రాసినా 80 ఏళ్లు రీఫిల్‌ మార్చాల్సిన పనిలేదు

Published : Nov 13, 2026, 05:43 PM IST

Space Pen: సాధారణ పెన్నుతో కాగితంపై రాయాలంటే గురుత్వాకర్షణ సహా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కానీ ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా ప‌ని చేసే పెన్ను ఒక‌టి ఉంది. అదే 'స్పేస్ పెన్'. దీనిని జీరో గ్రావిటీ పెన్ అని కూడా పిలుస్తారు.

PREV
15
స్పేస్ పెన్‌ను ఎవరు తయారు చేశారు?

స్పేస్ పెన్‌ను ఫిషర్ స్పేస్ పెన్ కంపెనీ తయారు చేస్తుంది. ఆస్ట్రియన్‌కు చెందిన ఫ్రెడరిక్ షాచ్టర్, ఎర్విన్ రాత్ ఈ పెన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పాల్ సి. ఫిషర్ ఇందులో ఉపయోగించే ప్రత్యేకమైన ఇంక్‌ను అభివృద్ధి చేశారు. 1965లో పాల్ ఫిషర్ AG7 అనే యాంటీ గ్రావిటీ పెన్‌కు పేటెంట్ పొందారు. ప్రస్తుతం ఈ పెన్నులను అమెరికాలోని నెవాడా రాష్ట్రం బౌల్డర్ సిటీలో తయారు చేస్తున్నారు. ఈ పెన్నులో కంప్రెస్డ్ ఇంకును ఉప‌యోగిస్తారు. దీంతో ప్ర‌తీ రోజూ రాసినా 80 ఏళ్ల‌పాటు రిఫీల్ మార్చాల్సిన ప‌నిలేదు.

25
స్పేస్ పెన్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి?

ఈ పెన్‌లో ప్రధానంగా రెండు రకాల డిజైన్లు ప్రసిద్ధి చెందాయి. వీటిలో మొద‌టిది AG7 ఆస్ట్రోనాట్ పెన్. ఇది సాధారణ బాల్‌పాయింట్ పెన్‌లా పొడవుగా ఉంటుంది. బటన్ నొక్కితే నిబ్ బయటకు వస్తుంది. తిరిగి నొక్కితే లోపలికి వెళ్లిపోతుంది. రెండోది బుల్లెట్ పెన్.. ఇది క్యాప్‌తో ఉండే చిన్న పెన్. క్యాప్ పెట్టినప్పుడు చిన్నగా ఉంటుంది. రాసేటప్పుడు క్యాప్‌ను వెనుక భాగంలో అమర్చుకుంటే సాధారణ పెన్ పరిమాణంలోకి మారుతుంది.

35
ఈ పెన్ ప్రత్యేకత ఏమిటి?

స్పేస్ పెన్‌లో ప్రత్యేకమైన ఒత్తిడితో పనిచేసే ఇంక్ కార్ట్రిడ్జ్ ఉంటుంది. ఇందులో నైట్రోజన్ వాయువును సుమారు 310 కిలోపాస్కల్స్ ఒత్తిడితో నింపుతారు. ఈ ఒత్తిడి వల్ల ఇంక్ బయటకు వస్తుంది. అందుకే గురుత్వాకర్షణ అవసరం లేకుండానే రాయగలదు. దీని చివర ఉండే బాల్‌ను టంగ్‌స్టన్ కార్బైడ్‌తో తయారు చేస్తారు. ప్రత్యేకమైన ఇంక్, లీకేజీని తగ్గించే నిర్మాణం దీనికి అదనపు బలం. సుమారు -34 డిగ్రీల నుంచి 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు పనిచేయగలదు. నీటిలో, తడి కాగితంపై, తలకిందులుగా పట్టుకున్నా రాయవచ్చు. దీని నిల్వ జీవితకాలం సుమారు 100 సంవత్సరాలుగా అంచనా వేశారు.

45
ఒక పెన్నుతో ఎన్ని కిలోమీటర్లు రాయవచ్చు?

ఫిషర్ స్పేస్ పెన్‌లోని కొన్ని ప్రత్యేక మోడళ్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఉదాహరణకు మిలీనియం మోడల్‌తో సుమారు 30.7 మైళ్లు అంటే 49.4 కిలోమీటర్ల వరకు రాయవచ్చని కంపెనీ పేర్కొంది. సాధారణ ప్రెజరైజ్డ్ రీఫిల్‌తో 12,000 అడుగులకు పైగా అంటే సుమారు 3.7 కిలోమీటర్లు రాయవచ్చు. ఈ పెన్ను ధర మోడల్‌ను బట్టి మారుతుంది. అందుబాటులో ఉన్న కొన్ని మోడళ్ల ధరలు సుమారు రూ.2,000 నుంచి రూ.25,000 వరకు ఉంటాయి. ప్రత్యేకమైన డిజైన్లు, కలెక్షన్ మోడళ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

55
నాసా కోట్ల రూపాయలు ఖర్చు చేసిందా?

స్పేస్ పెన్ గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం ఉంది. అంతరిక్షంలో రాయడానికి నాసా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పెన్నును తయారు చేయించిందని, రష్యా మాత్రం పెన్సిళ్లతోనే సరిపెట్టుకుందని చాలామంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాల్ ఫిషర్ తన సొంత పెట్టుబడితో ఈ పెన్నును అభివృద్ధి చేశారు. నాసా నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదు. 1965లో ఆయన స్వయంగా నాసాకు పెన్నును పరీక్షించమని అందించారు. పరీక్షల అనంతరం అపోలో అంతరిక్ష కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించాలని నాసా నిర్ణయించింది. 1967లో సుమారు 400 పెన్నులను కొనుగోలు చేసింది.

సోవియట్ యూనియన్ కూడా 1969లో 100 స్పేస్ పెన్నులను కొనుగోలు చేసింది. 2008లో అపోలో 17 మిషన్‌లో వ్యోమగామి జీన్ సెర్నాన్ ఉపయోగించిన స్పేస్ పెన్ వేలంలో 23,900 డాలర్లకు అమ్ముడైంది. 2021 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ ఈ పెన్నులను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా కనిపించే ఒక పెన్ను అంతరిక్షంలోనూ పనిచేసే స్థాయికి చేరడం వెనుక ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో స్పేస్ పెన్‌ను చూస్తే అర్థమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories