Income Tax Filing: జియో మ‌రో సంచ‌ల‌నం.. కేవలం రూ. 24కే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్ సౌక‌ర్యం

Published : Aug 11, 2025, 11:30 PM IST

Income Tax Filing: జియో ఫైనాన్స్ యాప్ కొత్త ట్యాక్స్ ప్లానింగ్ టూల్‌ను ప్రారంభించింది. కేవలం రూ. 24కే ఐటీఆర్ ఫైలింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

PREV
16
జియో ఫైనాన్స్ కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సౌకర్యం

జియో మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపింది. పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ సీజన్ హాట్ హాట్ గా మారుతున్న సమయంలో జియో ఫైనాన్స్ యాప్ కొత్త ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులు సరైన ట్యాక్స్ రెజీమ్‌ను ఎంచుకోవడమే కాకుండా, గరిష్ట మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది.

DID YOU KNOW ?
భారత్ లో పెరుగుతున్న ITR లు
భారతదేశంలో ITR దాఖలుదారుల సంఖ్య పెరుగుతోంది. CBDT ప్రకారం, AY 2024-25లో జూలై 31, 2024 నాటికి 7.28 కోట్ల ITRలు దాఖలయ్యాయి. ఇది AY 2023-24లో అదే తేదీ నాటికి నమోదైన 6.77 కోట్ల ITRల కంటే 7.5% అధికం.
26
సులభతరమైన ట్యాక్స్ ప్లానింగ్ సొల్యూషన్

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ టూల్ భారతీయ పన్ను చెల్లింపుదారులకు అద్భుతమైన సౌలభ్యం అందించడానికి రూపొందించారు. పన్ను ప్రణాళికను సులభతరం చేయడం, ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను చౌకగా, సమర్థవంతంగా మార్చడం దీని ప్రధాన ఉద్దేశంగా కంపెనీ పేర్కొంది.

ఈ సేవను ట్యాక్స్ బడ్డి అనే ఆన్‌లైన్ ట్యాక్స్ ఫైలింగ్ సేవల సంస్థ భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో బిల్ట్-ఇన్ కంప్లయెన్స్, నిపుణుల సహాయం అందిస్తారు.

36
జియో ఫైనాన్స్ కొత్త ట్యాక్స్ ఫైలింగ్ ఫీచర్లు, ప్రయోజనాలు

ఈ ట్యాక్స్ ఫైలింగ్ ఫీచర్ పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. పాత, కొత్త ట్యాక్స్ రెజీమ్‌ల మధ్య గల గందరగోళాన్ని తొలగించడం, 80C, 80D వంటి సెక్షన్ల కింద మినహాయింపులను మిస్ కాకుండా చూడడం వంటి ప్రయోజనాలు అందిస్తుంది.

అలాగే, ఈ ట్యాక్స్ ప్లానర్ భవిష్యత్ పన్ను బాధ్యతలను అంచనా వేసి తగ్గించడానికి, వ్యక్తిగత మినహాయింపు మ్యాపింగ్, ఈవాల్యూషన్, రెజీమ్ పోలికలు వంటి ఫీచర్లను అందిస్తుంది.

46
జియో ఫైనాన్స్ కొత్త ట్యాక్స్ ఫైలింగ్ ధరలు

జియో ఫైనాన్స్ కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసులలో పన్ను చెల్లింపుదారులు స్వయంగా రిటర్నులు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిపుణుల సహాయంతో కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది.

స్వీయ సేవా ప్లాన్: రూ. 24 నుండి ప్రారంభం

అసిస్టెడ్ ప్లాన్: రూ. 999 నుండి ప్రారంభం

ఈ రెండు కూడా జియో ఫైనాన్స్ యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి.

56
జియో ఫైనాన్స్ అధినేత ఏమన్నారంటే?

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో హితేష్ సేతియా మాట్లాడుతూ.. "ట్యాక్స్ ఫైలింగ్ గడువు దగ్గరపడుతున్న వేళ, ఈ ప్రక్రియను సులభతరం చేయడమే మా లక్ష్యం. సమర్థవంతమైన ట్యాక్స్ ప్లానింగ్ సర్వీసులతో కస్టమర్లకు సంవత్సరం పొడవునా పన్ను బాధ్యతలపై స్పష్టత కల్పించాలనుకుంటున్నాం" అన్నారు.

అలాగే, ఈ సేవను జియో ఫైనాన్స్ యాప్‌లో అనుసంధానం చేయడం ద్వారా పన్ను లావాదేవీలు మరింత సజావుగా, నిపుణుల సహాయంతో, పారదర్శకమైన ధరలతో అందించవచ్చని ఆయన చెప్పారు.

66
డిజిటల్ ఫైనాన్షియల్ సొల్యూషన్‌లో మరో ముందడుగు

జియో ఫైనాన్స్ ఈ కొత్త ట్యాక్స్ ఫైలింగ్, ప్లానింగ్ మాడ్యూల్ ద్వారా భారతీయులకు అందుబాటులో ఉండే, డిజిటల్-ఫస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్‌లను అందించడంలో మరో ముంద‌డుగు వేసింది. పన్ను సంబంధిత అన్ని అవసరాలను ఒకే యాప్‌లో పరిష్కరించుకునే సౌకర్యం దీనితో లభిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories