SIP: రూ. 5వేల‌తో మొదలు పెట్టి కోటి రూపాయ‌లు కూడ‌బెట్టొచ్చు.. మాయా లేదు, మంత్రం లేదు.. సింపుల్ లాజిక్

Published : Jan 24, 2026, 02:46 PM IST

SIP: స్టాక్ మార్కెట్ మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం కొంద‌రికీ మాత్ర‌మే తెలిసిన అంశం కానీ ప్ర‌స్తుతం.. సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రికీ అవ‌గాహ‌న పెరిగింది. ముఖ్యంగా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు ఎక్కువుతున్నారు. 

PREV
15
ఎస్ఐపీ పెట్టుబడితో లాభాలు ఏంటి.?

అనుకోని ఖర్చులు, భవిష్యత్ అవసరాలు ఎదురైనప్పుడు ఆర్థిక భద్రత చాలా ముఖ్యం. ఈ భద్రత కోసం పొదుపు ఒక్కటే కాదు, పెట్టుబడి కూడా అవసరం. అలాంటి పెట్టుబడి మార్గాల్లో ఎస్ఐపీ ఒక మంచి ఎంపిక. చిన్న మొత్తంతో ప్రారంభించి క్రమంగా పెద్ద సంపదను నిర్మించుకోవచ్చు.

25
ఎస్ఐపీ వైపు ఆకర్షితులవుతున్న భారతీయులు

గత కొన్ని ఏళ్లుగా ఎస్ఐపీ పెట్టుబడులపై భారతీయుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5.2 కోట్ల ఎస్ఐపీ ఖాతాలు ఉండగా, 2023లో అవి 6.3 కోట్లకు చేరాయి. 2024లో ఈ సంఖ్య 8.4 కోట్లకు పెరిగింది. 2025లో ఎస్ఐపీ ఖాతాలు 9 కోట్లకు పైగా చేరినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఇది ఎస్ఐపీపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

35
రూ.5,000తో ఎస్ఐపీ ఎలా ప్రారంభించాలి?

ఎస్ఐపీలో పెట్టుబడి కోసం భారీ మొత్తం అవసరం లేదు. నెలకు రూ.5,000తో కూడా ప్రారంభించవచ్చు. పెట్టుబడిని ఒకే ఫండ్‌లో పెట్టకుండా విభజించడం మంచిదని నిపుణుల సూచన. ఉదాహరణకు ఇండెక్స్ ఫండ్‌లో రూ.3,000, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో రూ.2,000. ఈ విధానం కొత్త పెట్టుబడిదారులకు రిస్క్ తగ్గించే అవకాశం ఇస్తుంది.

45
రూ.5,000 ఎస్ఐపీతో రూ.1 కోటి ఎలా సాధ్యం?

నెలకు రూ.5,000 పెట్టుబడితో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరాలంటే క్రమశిక్షణ అవసరం. ప్రతి ఏడాది పెట్టుబడిని కనీసం 10 శాతం పెంచాలి. అంటే మొదటి ఏడాది: రూ.5,000, రెండో ఏడాది: రూ.5,500, మూడో ఏడాది: రూ.6,050. ఈ విధంగా ప్రతి ఏడాది ఎస్ఐపీ మొత్తాన్ని పెంచుతూ వెళ్లాలి. దీర్ఘకాలంలో ఇది భారీ లాభాన్ని ఇస్తుంది.

55
ఎంత కాలంలో రూ.1 కోటి చేరుకోవచ్చు?

సగటున ఏడాదికి 12 శాతం రాబడి వస్తే, నెలకు రూ.5,000తో ప్రారంభించి, ప్రతి ఏడాది 10 శాతం పెంచుతూ పెట్టుబడి కొనసాగిస్తే సుమారు 20 ఏళ్లలో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే ఎస్ఐపీలో మంచి రిట‌ర్న్స్ పొందాలంటే దీర్ఘకాల పెట్టుబడి, క్రమంగా పెట్టుబడి పెంపు, మధ్యలో ఆపకుండా కొనసాగించడం అనే మూడు అంశాల‌ను క‌చ్చితంగా ఫాలో అవ్వాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories