EPFO: ఉద్యోగులు 100 శాతం పీఎఫ్ డ‌బ్బులు తీసుకోవ‌చ్చా.? ఇది ఎప్పుడు సాధ్య‌మ‌వుతుంది

Published : Jan 24, 2026, 02:00 PM IST

EPFO: ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల‌తో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్ర‌తీ భార‌తీయుడికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంద‌ని తెలిసిందే. ప్ర‌తీ నెల ఇందులో కొంత మొత్తం జ‌మ అవుతుంటుంది. ఉద్యోగ‌విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త కోసం ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

PREV
15
ఉద్యోగులకు పీఎఫ్ ఎందుకు కీలకం?

భారత్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పీఎఫ్ ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రత. ఉద్యోగంలో చేరిన వెంటనే ఉద్యోగి పేరుపై EPFO ఖాతా తెరుస్తారు. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అవసరమైన సమయంలో ఈ డబ్బును ఉద్యోగులు తీసుకునే అవకాశం ఉంది.

25
పీఎఫ్ విత్‌డ్రా కేటగిరీలు తగ్గింపు

ముందుగా పీఎఫ్ డబ్బు తీసుకునేందుకు 13 రకాల కేటగిరీలు ఉండేవి. దీనివల్ల ఉద్యోగులకు గందరగోళం ఏర్పడేది. ఈ సమస్యను తగ్గించేందుకు EPFO వాటిని కేవలం 5 కేటగిరీలకు పరిమితం చేసింది. దీని వల్ల ఎవరు ఎంత మొత్తం తీసుకోవచ్చో సులభంగా అర్థమవుతోంది.

35
కనీస ఉద్యోగ అనుభవం నిబంధన

పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవాలంటే ఉద్యోగి కనీసం 12 నెలలు పని చేసి ఉండాలి. ఈ నిబంధనను EPFO స్పష్టంగా అమలు చేస్తోంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాతే పార్ట్ విత్‌డ్రా అవకాశం ఉంటుంది.

45
ఎంత వరకు పీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు?

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి తన పీఎఫ్ ఖాతా నుంచి గరిష్ఠంగా 75 శాతం వరకు తీసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి చెల్లించిన మొత్తం, సంస్థ చెల్లించిన మొత్తం, వడ్డీ మొత్తం కూడా కలుస్తాయి. ముందుగా ఉన్న విధానంతో పోలిస్తే ఇది పెద్ద మార్పుగా చెప్పవచ్చు.

55
100 శాతం పీఎఫ్ ఎప్పుడు తీసుకోవచ్చు?

ఉద్యోగి ఒక సంవత్సరం పని పూర్తి చేసిన తర్వాత 100 శాతం పీఎఫ్ డబ్బు తీసుకునేందుకు EPFO అనుమతి ఇస్తోంది. వైద్య ఖర్చులు, పిల్లల చదువు, వివాహ ఖర్చులు, ఇల్లు కొనుగోలు చేయడం, ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం పూర్తి మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories