మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం, వెండి ధరలు వచ్చే 12 నెలల్లో కిలోకు రూ. 1.5 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సుకు 50 డాలర్ల వరకు వెండి చేరుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
25
ఇప్పటి వరకు వెండి రాబడులు ఎలా ఉన్నాయి?
ఈ ఏడాది ఇప్పటివరకు (2025 YTD) వెండి ధరలు MCXలో దాదాపు 37% రాబడులు ఇచ్చాయి. ఇది ఇతర ఆస్తుల కంటే మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. పెట్టుబడి డిమాండ్, పరిశ్రమల అవసరాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ప్రధాన దేశాల్లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలన్నీ కలిసి వెండి ధరలకు మద్దతు ఇస్తున్నాయి.
35
వెండి ధరలు పెరగడానికి కారణాలు ఏంటి.?
2025లో మొత్తం వెండి ఉత్పత్తిలో 60% డిమాండ్ పరిశ్రమల వద్ద నుంచే వస్తుందని అమెరికా-ఆధారిత సిల్వర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టెక్నాలజీ వంటివి వెండిపై ఆధారపడి ఉండటంతో డిమాండ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. రష్యా తొలిసారిగా తన రిజర్వుల కోసం వెండి కొనుగోలు చేస్తుందని ప్రకటించింది. వచ్చే మూడు సంవత్సరాల్లో USD 535 మిలియన్ ఖర్చు చేయనుంది. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది వెండి-ఆధారిత ETFలలో దాదాపు USD 40 మిలియన్ పెట్టుబడి పెట్టింది.
భారతదేశం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 3,000 టన్నులకుపైగా వెండి దిగుమతి చేసుకుంది. ఇది పరిశ్రమల డిమాండ్ మాత్రమే కాకుండా పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గణనీయంగా ఉందని చూపుతోంది. వెండి ETFలు కూడా ఈ ఏడాది భారీగా AUM (Assets Under Management) పెంచుకున్నాయి.
55
వెండి ధరలు పెరగడానికి కారణాలు
డాలర్ బలహీనత, US ఫెడ్ రేట్లు తగ్గుతాయనే అంచనాలు వెండికి అనుకూలంగా ఉన్నాయి. జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. అయితే, భారీ ర్యాలీ తర్వాత కొంత లాభాల స్వీకరణ (Profit Booking) జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.