Saving scheme: ప్ర‌తీ నెల‌ మీ జీతంలో రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టండి చాలు.. రూ. 11 ల‌క్ష‌లు పొందొచ్చు.

Published : Jun 15, 2025, 10:24 AM IST

ప్ర‌స్తుతం చాలా మంది పొదుపు మాంత్రాన్ని పాటిస్తున్నారు. అందులోనూ ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే వాటిపై మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
సుకన్య స‌మృద్ధి యోజ‌న‌

నెల‌కు కొంత మొత్తంలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ‘బేటీ బచావో, బేటీ పడావో’ మిషన్‌లో భాగంగా ప్రారంభించిన చిన్నపిల్లల పొదుపు పథకం. 

ఈ పథకాన్ని తల్లి, తండ్రి లేదా లీగల్ గార్డియన్ 10 ఏళ్ల లోపు వయస్సున్న అమ్మాయి పేరు మీద ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి చేసిన డబ్బుపై ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది.

24
నెల‌కు రూ. 2000 పొదుపు చేస్తే

ఉదాహ‌ర‌ణ‌కు మీ అమ్మాయి వ‌య‌సు ఏడాది అనుకుందాం. ఒక వేళ మీరు నెల‌కు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ. 24,000 పొదుపు చేశార‌నుకుందాం. ఇలా 21 ఏళ్ల పాటు ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా దాదాపు రూ. 11 లక్షలకు పైగా పొందొచ్చు. 

ఇది భారత ప్రభుత్వానికి చెందిన అత్యంత భద్రమైన, ట్యాక్స్‌ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్. ఈ స్కీమ్‌ ద్వారా చిన్న వయస్సులోనే అమ్మాయి భవిష్యత్తుకు పునాది వేయొచ్చు.

34
ఎంత లాభం వ‌స్తుంది.?

ఈ ప‌థ‌కంలో నెల‌కు రూ. 2 వేల చొప్పున 15 సంవత్సరాలు మీరు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి రూ. 3,60,000 అవుతుంది. 2025లో ప‌థ‌కాన్ని ప్రారంభిస్తే.. 2046లో పథకం మేచ్యూరిటీ అయ్యే నాటికి వడ్డీ రూపంలో రూ. 7,48,412 లభించి, మొత్తం రూ. 11,08,412 పొందవచ్చు.

44
ఎంత పెట్టుబ‌డి పెట్టొచ్చు.?

అమ్మాయి 10 ఏళ్లు లోపు ఉండాలి. క‌నీసం రూ. 250 నుంచి గ‌రిష్టంగార ఊ. 1,50,000 వ‌ర‌కు ఏటా పెట్టుబ‌డి పెట్టొచ్చు. 15 ఏళ్ల‌పాటు పెట్టుబ‌డి పెట్టాలి. ఆ త‌ర్వాత ఆరేళ్ల‌కు అంటే 21 ఏళ్ల‌కు మెచ్యూరిటీ అవుతుంది. 80C కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కంలో 8 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories