Wagon R: వేగన్ R కారుపై భారీ డిస్కౌంట్: రూ.1 లక్ష వరకు తగ్గింపుతో పాటు అదనపు ఆఫర్లు కూడా..

Published : Jun 13, 2025, 05:29 PM IST

మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ వేగన్ ఆర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలోనే దీన్ని కొనుక్కుంటే సుమారు రూ.లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు వంటి అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి.

PREV
15
వేగన్ ఆర్ అమ్మకాలు పెంచడానికే ఆఫర్లు

భారతదేశంలో అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ మోడల్ వేగన్ ఆర్ గత మే నెలలో 13,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూన్ నెలలో కూడా ఈ కారు అమ్మకాలను పెంచడానికి అద్భుతమైన తగ్గింపులను కంపెనీ ప్రకటించింది. జూన్ నెలలో ఈ కారును కొనుగోలు చేసిన వారు గరిష్టంగా రూ.1.05 లక్షల వరకు ఆఫర్లు పొందవచ్చు.

25
వేగన్ ఆర్ ధర రూ.7.35 లక్షలు

వేగన్ ఆర్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.64 లక్షల నుండి రూ.7.35 లక్షల వరకు ఉంటుంది. మీరు ఈ కారు ఈ నెలలో కొంటే అనేక బోనస్ లు కూడా లభిస్తాయి. కంపెనీ డైరెక్ట్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, అప్‌గ్రేడేషన్ బోనస్, స్క్రాప్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు వంటి అనేక ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాప్ బోనస్‌లో ఒకదాన్ని మాత్రమే కస్టమర్లు పొందగలరు. 

35
వేగన్ ఆర్ పై డిస్కౌంట్లు ఎలా ఉన్నాయంటే..

రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో ఉన్న పాత వేగన్ ఆర్ పెట్రోల్-AMT వేరియంట్‌పై గరిష్ట తగ్గింపు లభిస్తుంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఉన్న కొత్త వేగన్ ఆర్ AMT, రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన పెట్రోల్-మాన్యువల్, CNG వేరియంట్‌లపై రూ.40,000 నేరుగా తగ్గింపు లభిస్తుంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఉన్న కొత్త వేగన్ ఆర్ పెట్రోల్-మాన్యువల్, AMT వేరియంట్‌లపై మొత్తం రూ.95,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

45
వేగన్ ఆర్ మైలేజ్ ఎంత ఇస్తుందంటే..

మారుతి సుజుకి వేగన్ ఆర్ లో డ్యూయల్‌జెట్ డ్యూయల్ VVT టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో 1.0 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్, 1.2 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. 

1.0 లీటర్ ఇంజన్ లీటరుకు 25.19 కి.మీ మైలేజీని ఇస్తుంది. CNG వేరియంట్  అయితే కిలోకు 34.05 కి.మీ మైలేజీని ఇస్తుంది. 1.2 లీటర్ K-సీరీస్ డ్యూయల్‌జెట్ డ్యూయల్ VVT ఇంజన్ లీటరుకు 24.43 కి.మీ మైలేజీని ఇస్తుంది.

55
వేగన్ ఆర్ ఫీచర్లు ఇవే..

నావిగేషన్‌తో కూడిన 7 అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారుకు కొత్త అందాన్నిచ్చింది. రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, AMTలో హిల్-హోల్డ్ అసిస్ట్, నాలుగు స్పీకర్లు, స్టీరింగ్‌పై కంట్రోల్స్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న తగ్గింపులు వివిధ వెబ్‌సైట్ల నుండి సేకరించినవి. ఈ తగ్గింపులు రాష్ట్రం, ప్రాంతం, నగరం, డీలర్‌షిప్, స్టాక్, రంగు, వేరియంట్ మొదలైన వాటిని బట్టి మారవచ్చు. కారు కొనుగోలు చేసే ముందు మీ స్థానిక డీలర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories