SBI YONO: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల వాట్సాప్ సహా సోషల్ మీడియా వేదికల్లో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో SBI ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్‌కు సంబంధించిన KYC వివరాలు అప్‌డేట్ చేయాలని, అందుకోసం ఒక APK ఫైల్ డౌన్‌లోడ్ చేయాలని చెబుతున్నారు. అలా చేయకపోతే SBI YONO యాప్ పని చేయదని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈ మెసేజ్ వల్ల చాలా మంది ఖాతాదారులు అయోమయంలో పడుతున్నారు.
25
వైరల్ మెసేజ్‌లో ఏం చెబుతున్నారంటే..
వైరల్ అవుతున్న మెసేజ్ ప్రకారం, SBI యూజర్లు వెంటనే ఒక లింక్ ద్వారా APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఆధార్ అప్‌డేట్ కోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అప్‌డేట్ చేయకపోతే YONO యాప్ పూర్తిగా బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. ఇది నిజమేనా అనే సందేహం చాలా మందిలో ఏర్పడింది.
35
PIB ఫ్యాక్ట్ చెక్ ఏమంటోంది?
ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని ప్రకటించింది. SBI పేరుతో ఇలాంటి మెసేజ్‌లు పంపుతున్నారని, APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని కోరడం మోసానికి స్పష్టమైన సంకేతమని తెలిపింది. ఎవరూ అలాంటి ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించింది.
SBI కూడా ఈ విషయంలో ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. SMS, WhatsApp లేదా ఈమెయిల్ ద్వారా లింక్ పంపి APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని తాము ఎప్పుడూ చెప్పమని స్పష్టం చేసింది. ఆధార్ లేదా KYC వివరాలను లింక్‌ల ద్వారా అడగడం SBI విధానం కాదని బ్యాంక్ వెల్లడించింది.
55
నకిలీ APK లింక్‌ల వల్ల ప్రమాదం ఏంటి?
బ్యాంక్ తెలిపిన ప్రకారం, నకిలీ APK ఫైల్‌లు ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే మీ బ్యాంక్ లాగిన్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంది. దీని వల్ల అనధికార లావాదేవీలు జరిగి ఆర్థిక నష్టం కలగవచ్చు. అందుకే బ్యాంకింగ్ యాప్‌లను కేవలం Play Store లేదా App Store నుంచే డౌన్‌లోడ్ చేయాలని SBI సూచిస్తోంది.