2000 Notes : ఇంకా ప్రజలవద్దే ఉన్న రూ.2000 నోట్లు విలువెంతో తెలుసా?

First Published | Dec 3, 2024, 5:15 PM IST

రూ.2000 నోట్లను రద్దుచేసి ఏడాదికి పైనే అవుతోంది. కానీ ఇప్పటివరకు 100 శాతం నోట్లు ఆర్బిఐ వద్దకు చేరలేవు. ఇంకా ప్రజల్లోనే ఎన్నివేల కోట్ల విలువైన నోట్లు వున్నాయో తెలుసా?  

2000 Rupees Notes

2000 Rupees Notes : భారత కరెన్సీలో అత్యధిక విలువగల 2000 రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి ఏడాది పైనే అవుతోంది. ఈ నోట్లను చెలామణినుండి ఉపసంహరించుకున్న తర్వాత బ్యాంకుల ద్వారా వెనక్కితీసుకోవడం ప్రారంభించింది భారత రిజర్వ్ బ్యాంక్. కానీ ఇప్పటివరకు పూర్తిగా రూ.2000 నోట్లు తమవద్దకు రాలేవని... ఇంకా వేల కోట్ల విలువైన ఈ కరెన్సీ ప్రజల్లోనే వున్నాయని తేల్చింది. ఈ మేరకు ఆసక్తికర వివరాలను ఆర్బిఐ ప్రకటించింది. 

2000 Rupees Notes

ఆర్బిఐ వద్దకు చేరని రూ.2000 నోట్ల విలువెంతో తెలుసా? 

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్లధనాన్ని (బ్లాక్ మనీ) బయటకు తీసుకువచ్చేందుకు  మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. 2006 నవంబర్ 8న అర్ధరాత్రి స్వయంగా ప్రధాని మోదీ రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త రూ.500, రూ.2000 వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చారు. 

అయితే ఈ 2000 రూపాయల నోటును కూడా గతేడాది 2023 మే నెలలో రద్దు చేసింది. ఈ నోట్లు కలిగివున్నవారు బ్యాంకుల ద్వారా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇలా మొదట నాలుగు నెలలపాటు బ్యాంకుల ద్వారా... ఆ తర్వాత ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికీ ఆ అవకాశం వుంది. 

అయితే ఇలా రూ.2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తయింది. కానీ ఇప్పటికీ వందశాతం నోట్లు ఆర్బిఐ వద్దకు చేరలేవట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బిఐ ప్రకటించింది. ప్రస్తుతం ప్రజలవద్దే రూ.6,839 కోట్ల విలువైన రూ.2000 నోట్లు వున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
 


2000 Rupees Notes

రూ.2000 నోట్ల ఎప్పటివరకు ఎంతెంత ఆర్బిఐకి చేరిందంటే... 

రూ.2000 నోటును చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్న ప్రకటించే నాటికి మార్కెట్ లో వాటి విలువ రూ.3,55,858 కోట్లుగా వుంది.  కేవలం రెండు నెలల్లోనే అంటే జూన్ 2023 పూర్తయ్యేనాటికి 97 శాతానికి పైగా నోట్లు ఆర్బిఐ వద్దకు చేరాయి. కేవలం రూ.7,581 కోట్ల విలువైన నోట్లు (3 శాతం కంటే తక్కువ) మాత్రమే ప్రజల్లో వున్నాయి. 

ఇక తాజాగా రూ.2000 నోట్లకు సంబంధించిన  వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి బైటపెట్టారు. 2024 నవంబర్ 1 నాటికి ఆర్బిఐ వద్దకు రూ.3,48,891 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చేరుకున్నాయని ప్రకటించారు. అంటే ఇప్పటివరకు 98 శాతానికి పైగా రెండువేల నోట్లు ఆర్బిఐ వద్దకు చేరుకున్నట్లు మంత్రి పంకజ్ చౌదరి లోక్ సభలో రాతపూర్వకంగా వెల్లడించారు. 
 

ఇప్పటికీ మీ వద్ద రూ.2000 నోట్లు వుంటే ఎలా మార్చుకోవచ్చంటే : 

అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అప్పటికీ ఎవరివద్ద అయినా నోట్లు మిగిలివుంటే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం కల్పించాం. ఇప్పటికీ దేశంలోని 19 ఆర్బిఐ కార్యాలయాల్లో ఈ అవకాశం వుంది. 

ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాద్ తో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, ముంబై లో వున్నాయి. తెలుగువారిలో ఇంకా ఎవరివద్ద అయినా రూ.2000 నోట్లు వుంటే వీటిలో ఏది దగ్గరయితే అక్కడికి వెళ్లి  మార్చుకోవచ్చు. ఇక అహ్మదాబాద్, బేలాపూర్,భోపాల్, భువనేశ్వర్,చండీఘడ్, గౌహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్ కతతా,లక్నో, నాగపూర్,డిల్లీ, పాట్నాలలో కూడా ఆర్బిఐ కార్యాలయాలున్నాయి...అక్కడ కూడా మార్చుకోవచ్చు. 
 

Latest Videos

click me!