ఇండియన్ కంపెనీ అయిన బజాజ్ చేతక్ స్కూటర్ల తయారీలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. గత మోడల్‌లు పెట్రోల్‌తో నడిచేవి. కాని ఆధునిక వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ 4.2 kW BLDC మోటారుతో 2.89 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పరుగులు పెడుతుంది.
16 అక్టోబర్ 2019న బజాజ్ ఆటో కంపెనీ చేతక్ స్కూటర్ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అర్బనైట్ EV బ్రాండ్ ఆవిష్కరించింది. మొదట పూణే, బెంగుళూరు విక్రయాలు ప్రారంభించారు.
బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ తీసుకొచ్చి అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. బజాజ్ చేతక్ 3202 ద్వారా మీరు ఇప్పుడు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఒకటి బ్రూక్లిన్ బ్లాక్ కాగా, ఇంకొకటి గ్రే కలర్. దీని ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ.1,15,018గా ఉంది. అయితే అమ్మకాల సమయంలో లభించే ప్రత్యేక ఆఫర్ల ద్వారా మీరు రూ.7,000 అంతకంటే ఎక్కువ ఆదా చేయవచ్చు.
ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయాణాన్ని మరింత తక్కువ ధరకు మీరు ఎంజాయ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లను ప్రకటిస్తోంది. మీరు బజాజ్ చేతక్ 3202ని కొనుగోలు చేసినప్పుడు మీరు ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో రూ.6,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. అదే డెబిట్ కార్డ్ ద్వారా అయితే రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అదనంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఫ్లాట్ రూ.3,000 తగ్గింపు కూడా ఉంది.
బజాజ్ చేతక్ EV ధర & ఫీచర్లు
మీరు ఈఎంఐ విధానంలో లాంగ్ టర్మ్ చెల్లింపులు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ 3 సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన EMI పథకాలను అందిస్తుంది. ఇప్పటి వరకు చూసిన ఆఫర్లన్నీ మీరు పొందగలిగితే చేతక్ 3202 కేవలం రూ.1,06,417 ఎక్స్‌షోరూమ్ ధరకే మీ సొంతం అవుతుంది.
బజాజ్ చేతక్ 3202 5.6 bhp శక్తిని ఉత్పత్తి చేసే 3.2 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. బజాజ్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 137 కి.మీల వరకు పరుగు పెడుతుంది. గరిష్ట వేగం గంటకు 73 కి.మీ. ఈ బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 35 నిమిషాలు పడుతుంది.