RBI New Rules: ఫోన్‌పే, గూగుల్ పే, బ్యాంక్ కార్డులు వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆర్బీఐ 7 కొత్త రూల్స్

Published : Nov 24, 2026, 01:39 PM IST

RBI New Rules 2026: డిజిటల్ పేమెంట్స్ సేఫ్టీ కోసం ఆర్బీఐ 7 కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్, ట్రస్టెడ్ పర్సన్ అప్రూవల్ వంటి కొత్త రూల్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక సైబర్ దొంగల ఆటలు సాగవు

డిజిటల్ యుగంలో మనం చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మనల్ని పెద్ద సైబర్ ఉచ్చులో పడేయొచ్చు. ఏదైనా తప్పుడు లింక్‌పై పొరపాటున క్లిక్ చేస్తే చాలు, అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి, కస్టమర్ల డబ్బుకు పూర్తి రక్షణ కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది.

ఒకే ఒక్క స్విచ్‌తో అకౌంట్ నుంచి బయటకు వెళ్లే పేమెంట్లను ఆపేయగలిగితే ఎలా ఉంటుంది? లేదా పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు మనకు నమ్మకమైన వ్యక్తి అప్రూవల్ తీసుకునే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుంది? ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో ఆర్బీఐ కొత్త అప్‌డేట్స్ తీసుకువస్తోంది.

డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా మార్చడానికి, కస్టమర్లకు తమ డబ్బుపై పూర్తి కంట్రోల్ ఇవ్వడానికి ఆర్బీఐ సోమవారం కొత్త డ్రాఫ్ట్ రూల్స్ ప్రకటించింది. ఇందులో ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్, కస్టమైజ్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్, ట్రస్టెడ్ పర్సన్ అప్రూవల్ వంటి ఏడు కీలక రక్షణ చర్యలు ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే, డిజిటల్ పేమెంట్లను సేఫ్‌గా ఉంచుతూనే, బ్యాంక్ అకౌంట్లపై కస్టమర్లకు పూర్తి పవర్ ఇవ్వడమే ఈ కొత్త రూల్స్ ప్రధాన ఉద్దేశం.

26
అవుట్ గోయింగ్ పేమెంట్లను ఆపేందుకు ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్

ఆర్బీఐ ప్రతిపాదించిన వాటిలో అత్యంత కీలకమైనది ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్. ఇది సాధారణ అప్‌డేట్ కాదు, ఆపద సమయంలో మిమ్మల్ని కాపాడే కవచం లాంటిది. కారుకు ప్రమాదం జరగకుండా ఎమర్జెన్సీ బ్రేక్ వేసినట్లే, ఈ స్విచ్ ద్వారా కస్టమర్లు తమ అకౌంట్ నుంచి బయటకు వెళ్లే అన్ని డెబిట్ లావాదేవీలను వెంటనే బ్లాక్ చేయవచ్చు. అయితే, అకౌంట్‌లోకి వచ్చే ఇన్‌కమింగ్ పేమెంట్లు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే లోన్ ఈఎంఐలు, బ్యాంక్ ఛార్జీలు వంటి ఇప్పటికే ఉన్న రికరింగ్ మాండేట్లు, బ్యాంక్ ఆధారిత డెబిట్‌లపై దీని ప్రభావం ఉండదు.

36
ట్రాన్సాక్షన్ లిమిట్స్ సెట్ చేసుకునే అధికారం

ఈ కొత్త నిబంధనలు ఆమోదం పొంది అమల్లోకి వస్తే, కస్టమర్లు తమ డిజిటల్ పేమెంట్ పరిమితులను స్వయంగా సెట్ చేసుకోవచ్చు. ఒక్కో ట్రాన్సాక్షన్‌కు, వివిధ ఛానెళ్లలో రోజువారీ పేమెంట్లకు, అలాగే బెనిఫిషియరీలకు ఎంత డబ్బు పంపాలో మనమే డిసైడ్ చేయవచ్చు. ఉదాహరణకు, బ్యాంక్ ఎక్కువ లిమిట్ ఇచ్చినప్పటికీ, ఒక ప్రత్యేక వ్యక్తికి రోజుకు రూ. 20,000 మాత్రమే ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కస్టమర్లు పరిమితి పెట్టుకోవచ్చు.

46
అన్ని ఛానెళ్లకు కలిపి ఒకే డైలీ లిమిట్, టైమ్ రెస్ట్రిక్షన్స్

కొత్త రూల్స్ ప్రకారం, అకౌంట్ హోల్డర్లు అన్ని డిజిటల్ పేమెంట్ ఛానెళ్లకు కలిపి ఒకే మొత్తం రోజువారీ పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో ఛానెల్‌కు విడివిడిగా లిమిట్స్ పెట్టుకోవాల్సి వస్తోంది, కానీ ఇకపై మొత్తం రోజువారీ ఖర్చును ఒకేసారి కంట్రోల్ చేయొచ్చు.

అంతేకాదు, డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులతో పాటు ఏటీఎం, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్, పీఓఎస్ లావాదేవీలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట సమయాల్లో ఈ ఛానెళ్లు పనిచేయకుండా లాక్ కూడా పెట్టుకోవచ్చు.

56
కొత్త కస్టమర్లకు డిఫాల్ట్‌గా డిసేబుల్, ట్రస్టెడ్ పర్సన్ అప్రూవల్

కొత్తగా అకౌంట్ తీసుకునే కస్టమర్ల విషయంలో బ్యాంకులు డిజిటల్ పేమెంట్ ఛానెళ్లను డిఫాల్ట్‌గా డిసేబుల్ చేసి ఉంచాలి. కస్టమర్లు స్పష్టమైన అనుమతి ఇచ్చి, అవసరమైన అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాతే వీటిని యాక్టివేట్ చేయాలి. ఇది అనధికారిక లావాదేవీల నుంచి అదనపు రక్షణ ఇస్తుంది.

మరోవైపు, పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నమ్మకమైన వ్యక్తిని కస్టమర్లు స్వచ్ఛందంగా నామినేట్ చేసుకోవచ్చు. కస్టమర్ సెట్ చేసిన పరిమితి దాటి పెద్ద ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ నామినేట్ చేసిన వ్యక్తికి ట్రాన్సాక్షన్ వివరాలు వెళ్తాయి. వారు ఒక గంటలోపు దానిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు రిజెక్ట్ చేసినా లేదా గంటలోపు స్పందించకపోయినా ఆ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది.

66
బ్యాంకుల నిర్లక్ష్యంపై మరింత కఠినంగా నిబంధనలు

బ్యాంకుల నిర్లక్ష్యం నిర్వచనాన్ని ఆర్బీఐ మరింత విస్తృతం చేయాలని ప్రతిపాదించింది. అథెంటికేషన్ వైఫల్యాలు, ట్రాన్సాక్షన్ అలర్ట్‌లు మిస్ అవ్వడం, మోసాలపై ఫిర్యాదులను ఆలస్యంగా నమోదు చేయడం, ఫిర్యాదులను పరిష్కరించకపోవడం, సిస్టమ్ లోపాలు, సెక్యూరిటీ ఉల్లంఘనలు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు లేదా థర్డ్ పార్టీల కుమ్మక్కు వంటి అంశాలను కూడా ఇకపై బ్యాంకుల నిర్లక్ష్యం కిందకే తీసుకురానున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories