Railway: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్కరికీ రూ. 10 ల‌క్ష‌లు.. ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

Published : Jul 09, 2026, 07:15 PM IST

Railway: రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు చాలా మంది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్ష‌న్‌ను చూడ‌రు. కేవ‌లం 45 పైస‌ల‌కే రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ర‌క్ష‌ణ అందించే ఈ విధానాన్ని ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ అని పిలుస్తారు.  

PREV
15
ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

గతంలో ఇన్సూరెన్స్‌ తీసుకోవాలంటే ఏజెంట్‌ను కలవడం, ఫామ్‌లు నింపడం, ప్రీమియంలను పోల్చడం వంటి ప్రక్రియ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మీరు ఏదైనా వస్తువు లేదా సేవను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయంలోనే ఇన్సూరెన్స్ కూడా ఒక ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో స్క్రీన్ డ్యామేజ్, దొంగతనం లేదా ఇతర ప్రమాదాలకు ఇన్సూరెన్స్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే IRCTCలో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ ప్రీమియంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

25
ఇది ఎలా పనిచేస్తుంది?

ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ వెనుక టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు APIల ద్వారా అనుసంధానమై ఉంటాయి. దీంతో టికెట్ లేదా ప్రొడ‌క్ట్‌ కొనుగోలు చేసే సమయంలోనే ఇన్సూరెన్స్‌ ఆప్షన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు వేరే ప్రక్రియ అవసరం లేకుండానే చాలా తక్కువ ధరలో ఇన్సూరెన్స్ పొందగలుగుతున్నారు. ముఖ్యంగా IRCTCలో కేవలం 45 పైసలకే రూ.10 లక్షల వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండటం విశేషం.

35
ఎంబెడెడ్ ఇన్సూరెన్స్‌లో రెండు రకాలు

ఆటోమేటిక్ ఇన్సూరెన్స్:

కొన్ని ఉత్పత్తుల ధరలోనే ఇన్సూరెన్స్ ఖర్చు కలిపి ఉంటుంది. వినియోగదారు ప్రత్యేకంగా సెల‌క్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఆప్ట్-ఇన్ ఇన్సూరెన్స్:

వినియోగదారుడు స్వయంగా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే ఇన్సూరెన్స్‌ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, క్రోమా వంటి సంస్థల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌ల కొనుగోలుపై కూడా ఇలాంటి ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు అందిస్తున్నారు.

45
దీనివ‌ల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.?

ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ వల్ల వినియోగదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ఏజెంట్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ లభిస్తుంది. విశ్వసనీయ ఇన్సూరెన్స్‌ సంస్థల నుంచి కవరేజ్ లభిస్తుంది. ప్రమాదాలు లేదా అనుకోని ఘటనలు జరిగితే ఆర్థికంగా పెద్ద సహాయం అందుతుంది.

55
కాలపరిమితి ఎంత? ఎక్స్‌టెండెడ్ వారంటీ అంటే ఏంటి?

ప్రొడ‌క్ట్‌ను బట్టి ఇన్సూరెన్స్‌ కాలపరిమితి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో తయారీదారు ఇచ్చే సాధారణ వారంటీ ముగిసిన తర్వాత కూడా రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చులను భరించే ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మార్కెట్ పరిశోధనల ప్రకారం, ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ రావడంతో కొత్త ఇన్సూరెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గింది. దీంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు, వినియోగదారులకు సమానంగా ప్రయోజనం చేకూరుతోంది. ముఖ్యంగా IRCTCలో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు కనిపించే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను నిర్లక్ష్యం చేయకుండా, కేవలం 45 పైసలతో లభించే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ రక్షణను వినియోగించుకోవడం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories