Saving Scheme: రోజూ రూ. 300 ప‌క్క‌న పెడితే... రూ. 17 ల‌క్ష‌లు మీ సొంతం. ఈ ప‌థ‌కం గురించి మీకు తెలుసా.?

Published : Aug 01, 2025, 01:20 PM IST

Postoffice RD: పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో 2024 జనవరి నుంచి 6.7% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 100 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు. ఈ పథకానికి భారత ప్రభుత్వ హామీ ఉంది. 

PREV
15
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అందిస్తోన్న ప‌థ‌కాల్లో ఆర్డీ ఒక‌టి. ఇది నెలవారీగా చిన్న మొత్తాలను జమ చేస్తూ పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకునే పొదుపు పథకం. బ్యాంకు RD లాగా పనిచేస్తుంది కానీ, ప్రభుత్వ హామీ ఉండటం వల్ల‌ ఈ పథకం పూర్తిగా సురక్షితం. మార్కెట్‌లో మార్పులు వచ్చినా మీ డబ్బుపై ఎటువంటి ప్రభావం ఉండదు. స్థిరమైన రాబడి కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

DID YOU KNOW ?
ఎంత వ‌డ్డీ.?
పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో 2024 జనవరి నుంచి 6.7% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ. 100 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు. ఈ పథకానికి భారత ప్రభుత్వ హామీ ఉంది.
25
పెట్టుబడి వివరాలు, వడ్డీ రేటు

* కనీస పెట్టుబడి: నెలకు రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.

* వడ్డీ రేటు: ప్రస్తుతం 6.7% వార్షిక కాంపౌండింగ్ వడ్డీ లభిస్తుంది. ఈ రేటు జనవరి 1, 2024 నుంచి అమల్లో ఉంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రేటును సవరిస్తుంది.

* మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు. అవసరమైతే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

35
రోజుకు రూ. 333 జ‌మ చేస్తే

రోజుకు కేవలం రూ. 333 పొదుపు చేస్తే నెలకు సుమారు రూ. 10,000 జమ అవుతుంది.

5 సంవత్సరాల తర్వాత: మొత్తం డిపాజిట్ రూ. 6,00,000. వడ్డీ రూ. 1,13,659. మొత్తంగా రూ. 7,13,659 అవుతుంది.

10 సంవత్సరాల తర్వాత: మొత్తం డిపాజిట్ రూ. 12,00,000. వడ్డీ రూ. 5,08,546. మొత్తంగా రూ. 17,08,546 పొందొచ్చు.

మీరు నెలకు రూ. 5,000 మాత్రమే పొదుపు చేయ‌గ‌లిగినా, 10 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 8.54 లక్షలు వస్తాయి. ఇందులో వడ్డీ రూ. 2.54 లక్షలు ఉంటుంది.

45
పథకంలోని ముఖ్య ప్రయోజనాలు

భద్రత: ప్రభుత్వ హామీతో కూడిన పథకం కావడం వల్ల డబ్బు సురక్షితంగా ఉంటుంది.

లోన్ సౌకర్యం: ఖాతా ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత, జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు.

ముందస్తు మూసివేత: అత్యవసర సమయంలో మెచ్యూరిటీకి ముందే ఖాతా మూసుకోవచ్చు. అయితే వడ్డీపై కొంత కోత ఉంటుంది.

55
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ పథకంలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా జాయింట్ ఖాతా ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడి కోరుకునే వారు, భవిష్యత్తు ఖర్చులకు ముందుగానే ప్రణాళిక వేసుకునే వారికి ఇది సరైన ఎంపిక. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం సేవింగ్స్ చేసుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం పోస్టాఫీస్ అధికారిక వెబ్ సైట్ ను క్లిక్ చేయండి. లేదా స్థానికంగా ఉన్న పోస్టాఫీస్ ను సందర్శించండి. 

Read more Photos on
click me!

Recommended Stories