Old Gold: మీ దగ్గరున్న పాత బంగారం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? పాత బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకుంటే మంచిదా? లేక కొత్త నగలగా మార్చుకోవడం లాభమా అని ఆలోచిస్తున్నారా? ఏం చేస్తే మీ డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి.
భారతీయ సంప్రదాయంలో బంగారమంటే ఎంతో క్రేజ్. తరతరాలుగా మనవాళ్లు బంగారు ఆభరణాలు కొని ధరిస్తారు. అలా ధరించడం ఎంతో గొప్పగా భావిస్తారు. కొంతమంది భారీగా కొని బీరువాలో దాచుకుంటున్నారు. ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. అందుకే చాలా మంది తమ దగ్గర ఉన్న పాత నగలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కొంతమంది అమ్మేసి డబ్బుగా మార్చుకోవాలని ఆలోచిస్తే మరికొందరు పాత బంగారాన్ని ఇచ్చి కొత్తవి తీసుకోవాలని అనుకుంటారు. ఈ రెండింటిలో ఏది బెస్టో ఇక్కడ తెలుసుకుందాం.
23
అమ్మకపోవడమే మంచిది
మీ దగ్గరున్న పాత బంగారం అమ్మమ్మలు, నాన్నమ్మలు నాటిది కావచ్చు. దాన్ని కొనేముందు ఎవరైనా నాణ్యతను చెక్ చేస్తారు. ఇప్పుడు బంగార నాణ్యతను హాల్‌మార్క్ (Hallmark) నిర్ణక్ష్ిస్తుంది. కానీ మీ దగ్గరున్న పాత నగలపై హాల్ మార్క్ ఉండదు. దీని వల్ల చాలా మంది వ్యాపారులు ఆ పాత నగలకు ధర కొంచెం తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత నష్టపోవడం జరుగుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో మీరు పాత బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలనుకుంటే దాదాపు 20 శాతం తక్కువ డబ్బు వస్తుంది. ఉదాహరణకు ఈరోజు రేటు ప్రకారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ₹14,680 అనుకుందాం. మీరు 10 గ్రాముల బంగారాన్ని అమ్మితే, మీకు సుమారు ₹1.35 లక్షలు మాత్రమే చేతికి రావచ్చు.
33
పాతవి ఇచ్చి కొత్త నగలు తీసుకుంటే?
మీరు పాత బంగారాన్ని అమ్మకుండా వాటిని మార్చి కొత్త బంగారు నగలను తీసుకుంటే ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మీరు 10 గ్రాముల పాత బంగారాన్ని ఇచ్చి కొత్త నగలు తీసుకోవాలనుకుంటే, మీకు సుమారు ₹1.45 లక్షల విలువైన నగలు వస్తాయి. అంటే, ఇందులో కేవలం తరుగు కింద కొంత మాత్రమే కోత విధిస్తారు.
పాత బంగారాన్ని అమ్మడం లేదా కొత్త నగలు తీసుకోవడం అనేది మీరు వెళ్లే షాపు, ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు తరుగు ఎక్కువగా తీస్తే, మరికొందరు తక్కువగా తీస్తారు. మీరు గతంలో బంగారం కొన్న షాపుకే వెళ్తే వాళ్లు తరుగును కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం, పాత బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకోవడం కన్నా, దాన్ని ఇచ్చి కొత్త నగలు కొనడమే ఎక్కువ లాభదాయకం.