రూ. 16 లక్షలు ఎలా పొందాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?
ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ ఆర్‌డీ పథకంలో నెలకు రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేస్తున్నారు అనుకుందాం. 5 ఏళ్ల పాటు మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. 6.7 శాతం వడ్డీ రేటుతో మీకు వడ్డీ రూ. 1,13,600 వరకు వస్తుంది. దీంతో 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తంగా రూ. 713600 వరకు అందుతాయి. అయితే, మీరు మీ పొదుపు పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించారనుకుందాం.