Royal Enfield: బంపర్ ఆఫర్.. రూ.8 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీ ఇంటికి తీసుకెళ్లండి

Royal Enfield: యూత్‌ ఫేవరెట్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మీ సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.8,000 కడితే సరిపోతుంది. ఈ అతి తక్కువ డౌన్ పేమెంట్‌తో హ్యాపీగా ఈ బైక్ ని మీ ఇంటికి తీసుకెళ్లండి. ప్రతి నెలా ఈఎంఐలు కడుతూ హాయిగా బైక్ రైడింగ్ చేయండి. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. దాని పవర్‌ఫుల్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్ వల్ల యూత్‌కి పిచ్చిగా నచ్చేసింది. ఈ బైక్ రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. అందుకే చాలామంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనడం లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఎక్కువ రేట్ ఉండడం వల్ల కొనలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. తక్కువ డౌన్ పేమెంట్ తో ఈ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు. 

మీరు ఒక స్టైలిష్, పవర్‌ఫుల్ క్రూజర్ కోసం వెతుకుతుంటే హంటర్ 350 ఒక బెస్ట్ ఛాయిస్. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ద్వారా నడుస్తుంది. ఇది 20.2 బీహెచ్‌పీ పవర్ ఇంకా 27 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఇచ్చేలా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు ఉండటంతో లాంగ్ రన్ కి చాలా బాగుంటుంది. ఈ  బైక్ లీటర్‌కు 36.2 కిమీ మైలేజ్ ఇస్తుంది.


ఇది సిటీ ట్రిప్‌లకు ఇంకా హైవే రైడ్స్‌కు బాగా సూట్ అవుతుంది. దీని స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ లాంగ్ జర్నీలకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350ని కేవలం రూ.8,000 డౌన్ పేమెంట్‌తో ఇస్తోంది. బేసిక్ మోడల్ ధర రూ.1.73 లక్షలు (ఢిల్లీలో ఆన్ రోడ్). వేేరే స్టేట్స్ లో ధరలు కాస్త మారతాయి. డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బును లోన్ ద్వారా ఫైనాన్స్ చేసుకోవచ్చు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఫైనాన్స్ ఎలా పొందాలి

ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా మాక్సిమం 9% వడ్డీ రేటుతో లోన్ ఇస్తుంది. దీన్ని మీరు రెండు సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటే ఈఎంఐ నెలకు రూ.8,100 అవుతుంది. మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈఎంఐ వరుసగా రూ.5,800, రూ.4,700 కట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి వేసవిలో బైక్ టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సక్సెస్ ఎందుకైంది

దాని రెట్రో ఇన్‌స్పయిర్డ్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ హంటర్ 350 బైక్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలు. బడ్జెట్ లో ధర ఉండటం, స్ట్రాంగ్ ఫీచర్స్, బ్రాండ్ వాల్యూ ఈ బైక్ ఫేమస్ అవ్వడానికి కారణం. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆగస్ట్ 2022లో లాంచ్ అయింది. అప్పటి నుండి 5 లక్షల బైక్లను అమ్మిందంటే ఈ బైక్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓనర్ కావాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. తక్కువ డౌన్ పేమెంట్ ఇంకా ఈజీ ఈఎంఐ ఆప్షన్లతో హంటర్ 350 కొనుక్కోండి. 

Latest Videos

click me!