మీ బ్లడ్ గ్రూప్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా? లేకుంటే వెంటనే చెక్ చేయించుకోండి. ఒకవేళ మీది గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అయితే మీరు చాలా స్పెషల్. అలాగే మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే మీకు ఏ పరిస్థితుల్లోనైనా బ్లడ్ అవసరమైతే దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ప్రపంచంలోనే కేవలం 45 మంది ఉన్నారు. అది కూడా విదేశాల్లోనే ఉన్నారు. ఇండియాలో అసలు లేరు.
సాధారణంగా మనలో ఎవరికైనా A+, B+, AB+, O+, A-, B-, AB-, O- ఈ బ్లడ్ గ్రూప్ ల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. చాలా తక్కువ శాతం అరుదైన బ్లడ్ గ్రూప్ లు కలిగి ఉంటారు. వాటిల్లో బాంబే బ్లడ్ గ్రూప్, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ మరికొన్ని రకాలు ఉన్నాయి. ఇవి చాలా అరుదైనవి. ఇలాంటి బ్లడ్ గ్రూపు ఉన్న వారు ప్రపంచంలోనే పదుల సంఖ్యలో ఉంటారు. సాధారణ బ్లడ్ గ్రూపుల్లో కూడా నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న వారు తక్కువ మందే ఉంటారు. అంటే ఎక్కువ మంది పాజిటివ్ బ్లడ్ గ్రూపు వారే ఎక్కువగా ఉంటారు.
గోల్డెన్ బ్లడ్ గ్రూపును ఎప్పుడు కనిపెట్టారు
గోల్డెన్ బ్లడ్ గ్రూపు చాలా అరుదైన బ్లడ్ గ్రూపు. అసలు ఇలాంటి బ్లడ్ గ్రూపు ఒకటుందని కొన్ని దశాబ్దాల పాటు ఎవరికీ తెలియదు. ఈ బ్లడ్ గ్రూపును 1960లో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గోల్డెన్ బ్లడ్ గ్రూపు ఉన్న వారు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 45 మంది మాత్రమే ఉన్నారట. వారు కూడా అమెరికా, బ్రెజిల్, జపాన్, ఐర్లాండ్, కొలంబియా దేశాల్లో నివసిస్తున్నారు.
గోల్డెన్ బ్లడ్ గ్రూపును ఎలా గుర్తిస్తారు?
ఏ బ్లడ్ గ్రూపులో అయినా యాంటీజెన్, రక్త కణాల్లో ప్రోటీన్ ఉంటాయి. కాని గోల్డెన్ బ్లడ్ గ్రూపులో యాంటీజెన్, ప్రోటీన్ తక్కువగా ఉంటాయి. అందుకే ఈ రక్తపు సమూహాన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూపు అంటారు. శరీరంలో జరిగే ఒక మ్యుటేషన్ వల్ల ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీని వల్ల ప్రోటీన్ లేకుండా గోల్డెన్ బ్లడ్ గ్రూపు ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి మీకు కోపం ఎక్కువా? అయితే మీ బ్లడ్ గ్రూప్ అదే
గోల్డెన్ బ్లడ్ గ్రూపు వ్యక్తులకు వచ్చే సమస్యలు
ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా రక్తహీనత సమస్య ఉంటుంది. తరచూ నీరస పడుతుంటారు. బలం తక్కువగా ఉండటం వల్ల బరువైన పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఈ బ్లడ్ గ్రూపు వాళ్లు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గోల్డెన్ బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగి వారికి బ్లడ్ అవసరమైతే సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం. అందుకే కొన్ని బ్లడ్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కనిపెట్టిన 45 మంది నుంచి టైమ్ ప్రకారం బ్లడ్ సేకరించి స్టోర్ చేస్తుంటారు. అవసరమైనప్పుడు వాడుతుంటారు.