Post Office: మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో డబ్బు పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం మంచి పథకాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో పోస్టాఫీస్ అందిస్తోన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.
పోస్టాఫీస్ రెకరింగ్ డిపాజిట్ (RD) అనేది నెలనెలా ఒక స్థిరమైన మొత్తాన్ని జమ చేసే పొదుపు పథకం. ఈ స్కీమ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో పెట్టుబడిపై భద్రత ఉంటుంది. ఈ పథకంలో పెట్టిన డబ్బుపై ప్రస్తుతం సుమారు 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టే అవకాశం ఉండటంతో తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. చిన్నచిన్న పొదుపులను దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మార్చుకోవచ్చు.
25
ఎవరు ఖాతా తెరవచ్చు? ఎంత మొత్తంతో ప్రారంభించాలి?
ఈ పథకంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులు ఎవరైనా ఖాతా తెరవచ్చు. సమీప పోస్టాఫీస్‌లో చాలా సులభంగా RD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ. 100 కాగా గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది చిన్న ఆదాయం ఉన్నవారికి కూడా మంచి పొదుపు అలవాటు పెంచుతుంది.
35
మెచ్యూరిటీ కాలం, ముందస్తు విత్‌డ్రా
పోస్టాఫీస్ RD స్కీమ్ సాధారణంగా 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం కలిగి ఉంటుంది. అయితే పెట్టుబడి కొనసాగించాలనుకుంటే అదే ఖాతాను మరో 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి వస్తే 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఖాతాను ముందుగానే క్లోజ్ చేయవచ్చు. ఖాతాదారుడు మరణించిన పరిస్థితిలో నామినీ డబ్బును తీసుకోవచ్చు లేదా ఖాతాను కొనసాగించవచ్చు.
ఈ RD ఖాతా కేవలం పొదుపు కోసం మాత్రమే కాదు, అవసర సమయంలో ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఖాతా ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన తర్వాత ఖాతాదారుడు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తంలో 50% వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్‌పై అదనపు వడ్డీ కేవలం 2% మాత్రమే ఉంటుంది. బ్యాంకుల పర్సనల్ లోన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో లభించే అవకాశం.
55
రోజుకు రూ. 300 పొదుపుతో రూ. 15 లక్షలు
ఈ స్కీమ్‌లో పెద్ద ఫండ్ ఎలా తయారవుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ప్రతిరోజూ రూ. 300 సేవ్ చేస్తే, నెలకు సుమారు రూ. 9,000 అవుతుంది. ఈ మొత్తాన్ని RD ఖాతాలో జమ చేస్తే 5 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి రూ. 5,40,000 అవుతుంది. వడ్డీతో కలిపి ఫండ్ సుమారు రూ. 6 లక్షలకు పైగా అవుతుంది. అదే ఖాతాను మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తే (మొత్తం 10 సంవత్సరాలు) మొత్తం పెట్టుబడి రూ. 10,80,000 అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 15,20,889 అవుతుంది. దీంతో వడ్డీ రూపంలోనే మీరు రూ. 4,40,889 పొందుతారు. అంటే చిన్న పొదుపు అలవాటు వల్ల 10 సంవత్సరాల్లో మంచి ఫండ్ సిద్ధమవుతుంది.