5 ఏళ్ల‌లో రూ. 5 ల‌క్ష‌ల వడ్డీ.. జీరో రిస్క్‌, మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్

Published : Dec 02, 2025, 03:15 PM IST

Post office: ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్క‌రిలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతోంది. సంపాదించిన సొమ్మును స‌రైన విధానంలో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికేట్

పెట్టుబడి చేసే చాలామంది తమ డబ్బు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటారు. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లకు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. అందువల్ల రిస్క్ అన్నదే ఉండదు. వీటిలో ఎక్కువగా ప్రజలు ఎంచుకునే స్కీమ్ నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికేట్ (NSC). ఒకసారి పెట్టుబడి చేస్తే 5 ఏళ్ల తర్వాత మంచి లాభం పొందొచ్చు.

25
7.7% వడ్డీ

NSCపై ప్రభుత్వమే 7.7% స్థిర వడ్డీ ఇస్తోంది. ఇది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతూ పెరుగుతుంది. వడ్డీ మొత్తం 5 ఏళ్ల తర్వాతే ఒకేసారి మీకు వస్తుంది. ఉదాహరణకు మీరు ఈ ప‌థ‌కంలో రూ. 11,00,000 పెట్టుబ‌డి పెడితే.. 7.7% కాంపౌండింగ్‌తో 5 ఏళ్ల తర్వాత మొత్తం రూ. 15,93,937 వస్తుంది. ఇందులో కేవ‌లం రూ. 4,93,937 వ‌డ్డీ ల‌భిస్తుంది. రిస్క్ లేకుండా ఇలా దాదాపు 5 లక్షల లాభం వస్తుంది. ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే రిటర్న్ కూడా ఎక్కువే.

35
ఎంత పెట్టుబ‌డి పెట్టొచ్చు.?

NSC ప్రారంభించేందుకు పెద్ద అమెంట్ అవసరం లేదు. కనీసం రూ. 1,000తో కూడా ఖాతా ఓపెన్ చేయొచ్చు. పెట్టుబడికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మైనర్ పిల్లల పేరుతో కూడా ఖాతా ఓపెన్ చేయ‌వ‌చ్చు. రెగ్యుల‌ర్‌గా ఇన్‌క‌మ్ వ‌చ్చే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

45
5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియ‌డ్

ఈ స్కీమ్‌కు తప్పనిసరిగా 5 ఏళ్ల లాక్-ఇన్ ఉంటుంది. గడువు పూర్తయ్యేలోపు ఖాతా క్లోజ్ చేస్తే.. మీ పెట్టుబడి మాత్రమే తిరిగి వస్తుంది, వడ్డీ రాదు. కాబట్టి నిజమైన లాభం కావాలంటే 5 ఏళ్లు పూర్తి చేయడం అవసరం. గడువు ముగిసిన వెంటనే వడ్డీతో పాటు మొత్తం అమౌంట్ మీ ఖాతాలోకి వస్తుంది.

55
పన్ను తగ్గింపు – 80C కింద డబుల్ లాభం

NSC పెట్టుబడి చేయడం వడ్డీ రూపంలో లాభమే కాదు, పన్ను తగ్గింపు కూడా ఇస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. మొత్తం మీద ఈ ప‌థ‌కంలో సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి, ట్యాక్స్ సేవింగ్‌తో ల‌భిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories