Human Washing Machine: మాసిపోయిన దుస్తులను వాషింగ్ మెషీన్ లో వేస్తే చాలు అరగంటలో తెల్లగా ఉతికి ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనుషుల వాషింగ్ మెషీన్ వచ్చింది. జపాన్ శాస్త్రవేత్తలు ఈ వాషింగ్ మెషీన్ కనిపెట్టారు.
మురికి దుస్తులకు ఉతికేసే వాషింగ్ మెషీన్ లాగే ఇప్పుడు మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్ వచ్చేసింది. బాత్ టబ్ లో మునిగి, షవర్ కింద నిల్చుని స్నానం చేయాల్సిన అవసరం లేదు. జపాన్ వారు కనిపెట్టిన ఈ మనుషుల వాషింగ్ మెషీన్ కూర్చుంటే చాలు అదే ఒళ్లంతా మురికి పోయేలా స్నానం చేయిస్తుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోలో ఈ యంత్రాన్ని తొలిసారి ప్రదర్శనకు పెట్టారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే హ్యూమన్ వాషింగ్ మెషీన్.
25
ఇలా ఎలా ఉంటుంది?
ఈ వాషింగ్ మెషీన్ క్యాప్సూల్ లాగా ఉంటుంది. స్నానం చేసే వ్యక్తి దీని లోపల పడుకోవాలి. తరువత మూత వేసేయాలి. తర్వాత పాటలు వింటూ ఉండాలి. మిషన్ నీటిని తీసుకుని మీకు స్నానం చేయిస్తుంది. బట్టల వాషింగ్ మెషీన్‌లా ఇది మిమ్మల్ని తిప్పదు. ప్రశాంతంగా స్నానం చేయొచ్చు. వందశాతం శుభ్రతకు గ్యారెంటీ కూడా ఉంది.
35
విపరీతంగా అమ్మకాలు
గత ఆరు నెలల్లో జపాన్ టెక్నాలజీ ఫెయిర్‌లో ఇది హాట్ కేక్‌లా అమ్ముడైంది. 2.7 కోట్ల మందికి పైగా ఈ యంత్రాన్ని చూశారు. అయితే ఈ స్నాన యంత్రం ఆలోచన 1970లోనే వచ్చింది.
కంపెనీ ప్రతినిధి సాచికో మేకురా మాట్లాడుతూ ఈ కొత్త యంత్రం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనసును కూడా తేలికపరుస్తుంది అని చెప్పాడు. ఇది సెన్సార్ల ద్వారా వినియోగదారుడి హృదయ స్పందనను పర్యవేక్షిస్తుంది. ఒసాకాలోని ఒక హోటల్ సంస్థ తమ కస్టమర్ల కోసం దీన్ని కొనుగోలు చేసింది.
55
వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది?
ఈ క్యాప్సూల్‌లో పడుకుంటే చాలు. మైక్రోబబుల్స్, మిస్ట్ షవర్‌తో శరీరాన్ని శుభ్రపరుస్తుంది. సెన్సార్లు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. 15 నిమిషాల్లో స్నానం, ఆరబెట్టడం పూర్తవుతుంది. టవల్, సబ్బు అవసరం లేదు.