Gold Rate: ఈ ఏడాది బంగాంర, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2025లో వెండి ధర కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, వడ్డీ రేట్లలో కోత వంటివి వీటి ధరలు పెరిగేలా చేస్తున్నాయి.
బంగారంతో పాటూ వెండి కూడా ధర పెరుగుతోంది. 2025లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ట ధరకు చేరింది. బంగారం కన్నా పెట్టుబడిదారులు ఇప్పుడు వెండి పైనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఒక్కరోజులో 6 శాతం పెరిగింది. ఈ ఏడాది వెండి శక్తివంతమైన పెట్టుబడిగా మారింది.
24
వెండి ధర ఎందుకు పెరిగింది?
వెండి ధర పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, వడ్డీ రేట్లలో ఏర్పడిన కోత, డాలర్ విలువ పడిపోవడం వంటివి వెండి ధరను పెంచేలా చేస్తున్నాయి. అందుకే పెట్టుబడిదారులను వెండిపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతున్నారు. ఫెడ్ వడ్డీ కోత సూచనతో వెండి లాభదాయక అవకాశంగా మారింది.
34
ఎక్కడ వెండి అవసరం?
వెండికి ఆర్థికంగా విపరీతంగా డిమాండ్ పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో వెండిని ఎక్కువగా వాడుతున్నారు. కానీ, మైనింగ్ ఉత్పత్తి పెరగకపోవడంతో కొరత ఏర్పడింది. ఈ డిమాండ్-సప్లై మధ్య ఉన్న తేడా వల్లే వెండి ధర పెరుగుతోంది.
వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశమే కానీ… తగ్గే ఛాన్స్ లేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీనిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకసారి ఆర్ధిక నిపుణులును సంప్రదించి వారి సూచలన మేరకు పెట్టుబడి పెట్టడం మంచిది.