Bank holiday: వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు

Published : Jun 26, 2025, 11:39 PM IST

Bank holiday: జూన్ 27 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు పలు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
మూడు రోజులు బ్యాంక్ సెలవులు

Bank holidays: భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జూన్ 27, 28, 29 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం, జూన్ నెలలో ఇప్పటివరకు పలు ప్రాంతీయ, జాతీయ సెలవులు ఉన్నప్పటికీ, చివరి వారంలో బ్యాంకులు మూడు రోజులపాటు మూతపడడం గమనార్హం.

26
రథయాత్ర సందర్భంగా జూన్ 27న సెలవు

జూన్ 27, 2025 (శుక్రవారం)న ఒడిశా, మణిపుర్ రాష్ట్రాల్లో జగన్నాథ రథయాత్ర/కాంగ్ (Kang) పండుగ సందర్భంలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవు Negotiable Instruments Act ప్రకారం అధికారికంగా గుర్తించారు.

• ఒడిశాలోని పురీ నగరంలో జరిగే రథయాత్ర: ఇది ప్రతి ఏడాది జరిపే హిందూ పండుగ, ఇందులో జగన్నాథ స్వామి తన ఆలయం నుండి గుండిచా ఆలయానికి రథంపై ఊరేగుతారు.

• మణిపుర్‌లోని కాంగ్ పండుగ: ఇది మీతై వంశీయుల పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది కూడా జగన్నాథుని రథయాత్రే కానీ మణిపుర్‌కు అనుగుణంగా అక్కడి సంస్కృతిలో భాగంగా జరిపే పండుగ.

జూన్ 28, 29: వారాంతపు సెలవులు

• జూన్ 28 (శనివారం): నెలలో నాలుగవ శనివారం కావడంతో, RBI నియమాల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.

• జూన్ 29 (ఆదివారం): సాధారణ ఆదివారం సెలవు.

ఈ విధంగా, ఒడిశా, మణిపుర్‌లో బ్యాంకులు శుక్రవారం నుంచి ఆదివారం వరకూ మూడు రోజులపాటు పూర్తిగా మూతపడనున్నాయి.

36
జూన్ 30న మిజోరంలో బ్యాంక్ సెలవు

జూన్ 30, 2025 (సోమవారం)న మిజోరంలో రెంనా ని (Remna Ni) అనే శాంతి ఒప్పంద దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. ఇది రాష్ట్రానికి ప్రత్యేకమైన సెలవుగా గుర్తించారు.

రెంగు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఈ వారంలో శని, ఆదివారం మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

46
బ్యాంక్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి

బ్యాంకు శాఖలు మూతపడినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఇవి:

• ఇంటర్నెట్ బ్యాంకింగ్

• మొబైల్ బ్యాంకింగ్

• యుపిఐ (UPI)

• ఎటిఎంలు

• ఇంపిఎస్ (IMPS), ఎన్‌ఇఎఫ్టీ (NEFT) వంటి సేవలు

ఈ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి. కాబట్టి, శాఖల ద్వారా చేయాల్సిన ముఖ్యమైన లావాదేవీలు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

56
జూన్ 2025లో ఇప్పటికే పూర్తయిన ముఖ్యమైన బ్యాంక్ సెలవులు

• జూన్ 7 (శనివారం) – బక్రీద్ (ఇద్-ఉల్-అజ్హా): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత

• జూన్ 11 (బుధవారం) – సంత్ గురు కబీర్ జయంతి / సాగా దావా: సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూత

ఈ వారంలో బ్యాంక్ బ్రాంచ్‌లు ఓపెన్ ఉండే తేదీలు

జూన్ 23 నుండి జూన్ 26 వరకు, జూన్ 30న (మిజోరం తప్ప) దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి.

66
బ్యాంక్‌ల పని సమయాలు

• ప్రభుత్వ రంగ బ్యాంకులు (SBI, PNB, BOI): ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 4:00 వరకు

• ప్రైవేట్ బ్యాంకులు (HDFC, ICICI, Axis): ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 లేదా 4:30 వరకు

• బ్యాంక్ ఆఫ్ బరోడా: ఉదయం 9:45 నుండి సాయంత్రం 4:45 వరకు

• కెనరా బ్యాంక్: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

(పలు బ్రాంచుల్లో సమయాలు మారవచ్చు)

Read more Photos on
click me!

Recommended Stories