PM Viksit Bharat Rozgar Yojna: ఉద్యోగ అవకాశాలు పెంచే పీఎం వికసిత్ భారత్ ఉపాధి యోజనలో ఉద్యోగులకు రూ.15,000, కంపెనీలకు నెలకు రూ.3,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. దీనికి ఎవరు అర్హులు, ఎలా పొందాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఏమిటి? ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారు?
దేశంలో కొత్త ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి జూలై 1, 2025న కేబినెట్ ఆమోదం లభించింది.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన (PMVBRY) ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. రెండు సంవత్సరాల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా 3.5 కోట్లకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించారు.
25
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనతో ఉద్యోగులకు కలిగే లాభాలు
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఈ పథకం రెండు విడతలుగా రూ. 15,000 వరకు ఒక నెల జీతాన్ని అందిస్తుంది.
ఒకసారి గరిష్టంగా రూ.15,000 వరకు లభిస్తుంది.
దీనిని రెండు విడతలుగా చెల్లిస్తారు.
ఉద్యోగి నెలవారీ వేతనం (Basic + DA) ఆధారంగా ప్రోత్సాహకం నిర్ణయిస్తారు.
గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు జీతం పొందే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.
35
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తో కంపెనీలకు కలిగే ప్రయోజనాలు
యజమానులు కూడా పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ద్వారా కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. కొత్త ఉద్యోగులను నియమించుకున్న సంస్థలకు:
రూ.10,000 జీతం కలిగిన ఉద్యోగి పై నెలకు రూ.1,000
రూ.10,000 నుంచి 20,000 జీతం ఉంటే రూ.2,000
రూ.20,000 నుంచి 30,000 జీతం ఉంటే రూ.3,000 వరకూ సబ్సిడీ ఇస్తారు.
తయారీ రంగంలో ఉన్న కంపెనీలకు ఈ ప్రయోజనం రెండేళ్ల బదులు నాలుగేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హత ప్రమాణాలు ఏమిటి?
50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 5 కొత్త ఉద్యోగులను,
50 మందికి తక్కువ ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని కొత్తగా ఉద్యోగంలో నియమించుకోవాలి.
కొత్తగా చేరిన ఉద్యోగులు కనీసం 6 నెలలు అదే సంస్థలో కొనసాగాలి.
సామాజిక భద్రతా చట్టం అయిన EPF & MP చట్టం 1952 కింద మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఈ పథకానికి అర్హులుగా ఉన్నాయి.
55
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం కింద ప్రయోజనం పొందడానికి ఉద్యోగులు అధికారిక పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా తమ UAN నంబర్ నమోదు చేసుకోవాలి. యజమానులు ECR (Electronic Challan-cum-Return) సమర్పించాలి. కొత్త, ప్రస్తుత ఉద్యోగులందరికీ యూఏఎన్ తప్పనిసరిగా తెరవాలి.
మొత్తంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ఉద్యోగులకు ఆర్థిక భరోసా, కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది.