Pension: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్రధాన మంత్రి శ్రమ్‌యోగి మంధాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందించే అవకాశం కల్పిస్తోంది.
అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక లబ్ధిదారులకు కనీసం రూ.3,000 నెలవారీ పెన్షన్ అందిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా మారింది.
25
ఇప్పటికే 46 లక్షల మందికి పైగా నమోదు
కేంద్ర కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 నవంబర్ 25 నాటికి ఈ పథకంలో సుమారు 45.77 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.
35
రోజుకు రూ.2 పొదుపుతో రూ.3,000 పెన్షన్
ఈ పథకంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. కొంతమంది రోజుకు రూ.2 వరకు సేవ్ చేసినా ఈ స్కీమ్‌లో భాగం కావచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉంటే నెలకు రూ.55 చెల్లించాలి. 19 ఏళ్ల వారికి నెలకు రూ.100, 40 ఏళ్ల వారికి నెలకు రూ.200 వరకు చెల్లించాలి. వ్యక్తి వయస్సును బట్టి మొత్తం మారుతుంది.
ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. పెన్షన్ ప్రారంభమయ్యే ముందు లబ్ధిదారుడు మరణిస్తే, అతని భార్య లేదా భర్తకు పెన్షన్‌లో 50 శాతం మొత్తాన్ని అందిస్తారు. దీంతో కుటుంబానికి కూడా కొంత ఆర్థిక భరోసా ఉంటుంది.
55
ఈ స్కీమ్ ఎవరికి ఎక్కువ ఉపయోగం?
ఈ పథకం ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు కూలీలు, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు, చెప్పులు కుట్టేవారు, టైలర్లు, ఆటో, రిక్షా డ్రైవర్లు, చిన్న వ్యాపార కార్మికులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.