ఇది చూడ్డానికి చిరు వ్యాపారమే.. లాభాలు మాత్రం లక్షల్లో, మీరు ట్రై చేస్తారా?

Published : Oct 31, 2025, 07:53 PM IST

Business Ideas : ఫుడ్ బిజినెస్‌లో పానీపూరి మెషీన్ ఒక కొత్త స్టార్టప్ ట్రెండ్‌గా మారింది. తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ సిబ్బందితో మీరు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. పూర్తి ఖర్చు, లాభాల వివరాలు తెలుసుకోండి...

PREV
15
ఈ బిజినెస్ లో లాభాలే లాాభాలు

పానీపూరి మెషీన్ ఒక ఫుల్లీ ఆటోమేటిక్ యూనిట్. ఇది పిండి ముద్దను తీసుకొని గంటకు 3500–4000 పానీపూరీలు చేస్తుంది. ఇందులో రెండు ముఖ్యమైన పరికరాలు ఉంటాయి. మొదటిది డో మిక్సర్ (Dough Mixer) సుమారు 30,000 రూపాయలు… రెండోది ప్రధాన పానీపూరి మెషీన్ సుమారు 55,000 రూపాయలకు వస్తుంది. అంటే మొత్తం మెషీన్ ఖర్చు 85,000 రూపాయలు. దీనికి జీఎస్టీ అదనం. ఈ మెషీన్ పిండిని ఒత్తడం, కట్ చేయడం, తేలికగా వేడి చేయడం వంటి పనులన్నీ ఆటోమేటిక్‌గా చేస్తుంది.

25
పానీపూరి మెషీన్‌కు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

భారత్‌లో దాదాపు 30% జనాభా రోజూ పానీపూరి తింటారు. వేగంగా పెరుగుతున్న పట్టణ జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, సమయాభావం వల్ల ఇప్పుడు ప్రజలు రెడీ-టు-ఈట్ స్నాక్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే మార్కెట్లో ఇప్పుడు రకరకాల టెక్నాలజీతో, అందుబాటు ధరల్లో పానీపూరి మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు కూడా వీటిని కొని సులభంగా వ్యాపారం మొదలుపెట్టవచ్చు.

35
మెషీన్‌తో పానీపూరి ఎలా తయారు చేస్తారు?

ముడిసరుకు ఖర్చు కిలోకు 25–30 రూపాయలు ఉంటుంది.

ప్రధాన పదార్థాలు మైదా, నీళ్లు, ఉప్పు.

మైదా లేదా రవ్వ, నీళ్లను సరైన నిష్పత్తిలో మిక్సర్‌లో వేయాలి.

పిండి ముద్ద తయారయ్యాక దాన్ని మెషీన్‌లో వేయాలి.

మెషీన్ పిండిని ఒత్తి, కట్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తుంది.

కొన్ని నిమిషాల్లోనే పచ్చి పానీపూరీలు తయారవుతాయి.

45
పానీపూరి యూనిట్ కోసం అవసరమైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు

జీఎస్టీ రిజిస్ట్రేషన్

FSSAI లైసెన్స్

ఫైర్, పొల్యూషన్ NOC

బ్రాండ్ పేరును కాపాడుకోవడానికి ట్రేడ్‌మార్క్

పానీపూరి యూనిట్‌కు ఎంత స్థలం, ఎంతమంది సిబ్బంది కావాలి?

స్థలం: 500 చదరపు అడుగులు (అద్దె నెలకు దాదాపు 10,000 రూపాయలు)

సిబ్బంది: 1 నైపుణ్యం ఉన్నవారు, 1 లేదా 2 నైపుణ్యం లేనివారు

55
పానీపూరి మెషీన్‌కు అయ్యే మొత్తం ఖర్చు

యంత్రాలు- 1 లక్ష రూపాయలు

ఫర్నిచర్- 20 వేల రూపాయలు

వర్కింగ్ క్యాపిటల్- 1.11 లక్షల రూపాయలు

మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు- 2.31 లక్షల రూపాయలు

పానీపూరి యూనిట్‌లో ప్రధాన ఖర్చులు

కరెంట్ బిల్లు (2 KW)- 2,240 రూపాయలు

సిబ్బంది జీతాలు- 38,000 రూపాయలు

అద్దె- 10,000 రూపాయలు

ఈ పానీపూరి బిజినెస్ లో మొదటి ఏడాది నుంచే లాభాలు మొదలవుతాయి. నాలుగో ఏడాదికల్లా పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది.

గమనిక : ఈ ఆర్టికల్ కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ ఇచ్చిన సమాచారం, వివరాలు kviconline.gov.in నుంచి తీసుకున్నవి. వ్యాపారం చేసే ముందు మీ సొంతంగా పరిశోధన చేయండి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా సంబంధిత శాఖను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories