Post Office: సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని చెబుతుంటారు. పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా లాభాలు స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒకటి. పోస్టాఫీస్ అందిస్తోన్న ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం
ఇటీవలి కాలంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో చాలా బ్యాంకులు ఇప్పుడు 6–7% మధ్య వడ్డీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన, ప్రభుత్వ హామీతో కూడిన, మంచి వడ్డీ రాబడినిచ్చే స్కీమ్ కావాలనుకునే వారికి పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) మంచి ఎంపికగా నిలుస్తోంది.
25
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ముఖ్యాంశాలు
NSC పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1989లో ప్రారంభించింది. ఇది తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి పథకం. కనీసం రూ.1000తో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ లేదు మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
* మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు
* ప్రస్తుత వడ్డీ రేటు: 7.7% (ప్రతి సంవత్సరం కాంపౌండింగ్ వడ్డీ)
* పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు
35
రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది?
ఒకవేళ మీరు పోస్టాఫీస్ NSCలో రూ.10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే.. ప్రతి సంవత్సరం 7.7% వడ్డీ కాంపౌండింగ్ పద్ధతిలో లెక్కిస్తారు. ఐదేళ్ల తర్వాత మొత్తం రూ.14,48,987 లభిస్తుంది. అంటే మీరు పెట్టిన రూ.10 లక్షలపై రూ.4,48,987 అదనంగా వడ్డీగా లభిస్తుంది. ఇది ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కంటే స్పష్టంగా ఎక్కువ.
* ప్రభుత్వ హామీ: కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి హామీ ఇస్తుంది, కాబట్టి పెట్టుబడి పూర్తిగా భద్రం.
* పన్ను మినహాయింపు: పెట్టిన మొత్తానికి సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.
* నిర్ధిష్ట రాబడి: మార్కెట్ మార్పుల ప్రభావం ఉండదు. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.
* తక్కువ మొత్తంతో మొదలు పెట్టవచ్చు: రూ.1000 నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు.
55
రీన్యువల్, ఇతర వివరాలు
5 సంవత్సరాల తర్వాత ఈ సర్టిఫికెట్ మెచ్యూర్ అవుతుంది. దీన్ని పొడిగించే అవకాశం లేదు. కానీ మీరు అదే సమయంలో కొత్త NSC తీసుకోవచ్చు. NSC సర్టిఫికెట్లు రూ.100, రూ.500, రూ.1000, రూ.5000, రూ.10,000ల డినామినేషన్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్ని సర్టిఫికెట్లు కావాలంటే అన్ని కొనుగోలు చేయవచ్చు.