OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండ‌గలాంటి వార్త‌.. వారి కోసం ప్ర‌త్యేకంగా యాప్.

Published : Sep 22, 2025, 09:35 AM IST

OYO: చిన్న స్టార్ట‌ప్ కంపెనీలాగా ప్రారంభమై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది ప్ర‌ముఖ హోట‌ల్ చైన్ సంస్థ ఓయో. యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొంగొత్త సేవ‌లు తీసుకొస్తున్న ఓయో తాజాగా మ‌రో ప్ర‌త్యేక యాప్‌ను తీసుకొచ్చింది. 

PREV
15
లగ్జరీ సెగ్మెంట్‌లోకి

ఓయో అన‌గానే త‌క్కువ ధ‌ర‌లో రూమ్స్ ల‌భిస్తాయ‌నే ఆలోచ‌న‌లో మ‌న‌లో అంద‌రికీ ఉంటుంది. అయితే ఓయో ఇప్పుడు కొత్త మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ కంపెనీ పేరెంట్ ఆర్గనైజేషన్ ప్రిజం (PRISM) తాజాగా ప్రీమియం హోటల్స్, లగ్జరీ విల్లాలు, ప్రత్యేకమైన ట్రావెల్ అనుభవాల కోసం ‘చెక్ఇన్ (CheckIn)’ అనే యాప్‌ను పరిచయం చేసింది. ఇప్పటివరకు తక్కువ ధరలో వసతులు అందించిన ఓయో, ఇప్పుడు హైఎండ్ సర్వీసెస్ కోరుకునే వారికి ప్రత్యేకంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌ను తీసుకొచ్చింది.

25
ప్రీమియం అనుభవానికి హామీ

చెక్ఇన్ యాప్‌లో కనిపించే ప్రతి హోటల్, హోమ్‌స్టే కఠిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. సండే హోటల్స్ (SUNDAY Hotels), క్లబ్‌హౌస్ (Clubhouse), పాలెట్ (Palette) వంటి బ్రాండ్లతో పాటు, యూరప్‌లోని చెక్‌మైగెస్ట్ (CheckMyGuest), డాన్‌సెంటర్ (Dancenter), బెల్విల్లా (Belvilla) వంటి లగ్జరీ హాలిడే హోమ్స్ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులు రెండు ప్రయోజనాలు పొందుతారు. ఒకటి నాణ్యత గ్యారెంటీ, రెండవది అన్ని ఆప్షన్లు ఒకే యాప్‌లో లభించడం.

35
భారత్‌లో అతిపెద్ద ప్రీమియం హోటల్ చైన్ లక్ష్యం

ప్రస్తుతం భారత్‌లోనే 1,300కు పైగా ప్రీమియం హోటల్స్‌ను కలుపుకొని దేశంలోనే అతిపెద్ద హోటల్ చైన్‌గా మారడమే చెక్ఇన్ ప్రధాన లక్ష్యం. ఇందులోని ప్రతి హోటల్‌ను నిపుణుల బృందాలు నేరుగా నిర్వహిస్తాయి. అందువల్ల శిక్షణ పొందిన సిబ్బంది, నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, పరిశుభ్రమైన గదులు, స్టాండర్డైజ్డ్ కిట్స్ అన్ని చోట్లా ఒకే విధంగా లభిస్తాయి. ఈ కలెక్షన్‌లో టౌన్‌హౌస్ బేసిక్ కేటగిరీగా ఉండగా, సండే హోటల్స్ ప్రీమియం సెగ్మెంట్‌గా ఉంటాయి.

45
భారత్ నుంచి గ్లోబల్ మార్కెట్‌కి విస్తరణ

ఈ యాప్‌ను మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా భారత్‌లో మూడు నెలలపాటు టెస్ట్ చేశారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా లైవ్ చేశారు. లండన్, దుబాయ్, బాలి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ యాప్ సర్వీసులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇంటర్నేషనల్ మార్కెట్లలో విస్తరించి, లగ్జరీ ట్రావెల్‌కి ఒక గ్లోబల్ హబ్‌గా మార్చడమే సంస్థ వ్యూహం.

55
మారుతున్న ట్రావెల్ అభిరుచులు

ఓయో చేసిన తాజా సర్వే ప్రకారం, దాదాపు 45% ప్రయాణికులు బడ్జెట్ హోటల్స్‌ను ఇష్టపడుతుండగా, 55% ప్రయాణికులు లగ్జరీ అనుభవాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఓయో ఇప్పుడు రెండు వేర్వేరు వర్గాల కోసం వేర్వేరు యాప్‌లను అందిస్తోంది. బడ్జెట్ ట్రావెలర్స్‌కి “OYO యాప్”, ప్రీమియం ట్రావెలర్స్‌కి “CheckIn యాప్”. దీని వలన వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories