Car: రూ. ల‌క్ష చెల్లించి మీ సొంత కారు క‌ల నిజం చేసుకోండి..

Narender Vaitla | Updated : May 10 2025, 08:20 PM IST
Google News Follow Us

కారు కొనుగోలు చేయ‌డం అనేది చాలా మందికి ఒక క‌ల లాంటిది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికి చెందిన వారు మాత్రమే కారు గురించి ఆలోచించే వారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. నెలకు కేవలం రూ. 6 వేలు ఈఎమ్ఐ చెల్లించి కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఒక బెస్ట్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

15
Car: రూ. ల‌క్ష చెల్లించి మీ సొంత కారు క‌ల నిజం చేసుకోండి..

తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి మారుతి ఆల్లో కే10 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ. 4 ల‌క్ష‌ల ప్రారంభ వేరియంట్‌తో అందుబాటులో ఉన్న ఈ కారును నెల‌కు కేవ‌లం రూ. 6 వేల ఈఎమ్ఐ చెల్లించి సొంతం చేసుకోవ‌చ్చు. ఇంత‌కీ కారులో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయంటే. 
 

25

ఈ కారులో  998 cc, 3-సిలిండర్ K10C పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. 66 bhp @ 6,000 rpm పవర్ ఈ ఇంజ‌న్ సొంతం. ఇక ఈ కారు 89 Nm వ‌ద్ద‌ 3,500 rpmని సృష్టిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్)ని అందించారు. మైలేజ్ విష‌యానికొస్తే పెట్రోల్ వేరియంట్‌కి ARAI మైలేజ్ 24.39 kmpl; CNG వేరియంట్‌కి 33.85 km/kg అందిస్తుంది. 
 

35

ఇందులో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్‌ను అందించారు. కొన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను అందించారు. 
రివర్స్ పార్కింగ్ సెన్సర్లు ఇచ్చారు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్డ్ ప్లే వంటి ఇంటీరియ‌ర్ ఫీచ‌ర్ల‌ను అందించారు. అన్ని వేరియంట్స్‌లో ప‌వ‌ర్ స్టీరింగ్, ఎయిర్ కండీష‌న‌ర్ ఇచ్చారు. 

45

ఈ కారు మెటాలిక్ గ్రైనెట్ గ్రే, సిజ్లింగ్ రెడ్‌, ప్రీమియం ఎర్త్ గోల్డ్‌, ప‌ర్ల్ బ్ల‌యిస్ బ్లాక్‌, మెటాలిక్ సిల్కీ సిల్వ‌ర్, సాలిడ్ వైట్ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు. ధ‌ర విష‌యానికొస్తే మారుతి ఆల్టో కే10 Std వేరియంట్ రూ. 4 ల‌క్ష‌లు, LXi    ₹4.80 లక్షలు, VXi    ₹5.10 లక్షలు, VXi (O)    ₹5.50 లక్షలు, VXi+₹5.80 లక్షలుగా ఉంది. 
 

55
Maruti Alto K10

రూ. ల‌క్ష డౌన్‌పేమంట్‌తో 

ఈ కారును రూ. ల‌క్ష డౌన్ పేమెంట్ చెల్లించి సొంతం చేసుకోవ‌చ్చు. మిగ‌తా మొత్తాన్ని 9 శాతంతో రుణం పొందొచ్చు. రూ. 4 ల‌క్ష‌కు రుణం ల‌భిస్తుంది. మీరు ఒక‌వేళ 7 సంవ‌త్స‌రాలు ఈఎమ్ఐ ఎంచుకుంటే నెల‌కు రూ. 6,553 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నెల‌కు రూ. 6 వేలు చెల్లించి మీ సొంత కారు క‌ల‌ను నిజం చేసుకోవ‌చ్చు.

Read more Photos on
Recommended Photos