ఏప్రిల్ నెలాఖరు వరకే..
SUV విభాగంలో మంచి పేరున్న కార్లలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. అత్యధిక ఫీచర్లు దీని సొంతం. అయితే ఈ తగ్గింపు అవకాశం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు నిస్సాన్ మాగ్నైట్ SUV కొంటే బంగారు నాణెం గెలుచుకునే అవకాశం కూడా ఉంది
హాట్రిక్ కార్నివాల్ ఆఫర్ పేరుతో నిస్సాన్ ఈ డిస్కౌంట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్ పై రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. మీరు ఒక అద్భుతమైన కాంపాక్ట్ SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. కారు కొన్న ప్రతి ఒక్కరికీ బంగారు నాణెం ఇస్తున్నారు.
ఐపీఎల్ ఊపు మీదున్న సందర్భంగా ప్రతి షోరూమ్‌లో క్రికెట్ థీమ్ అలంకరణ చేస్తున్నారు. ఈసారి నిస్సాన్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా, క్రికెట్‌తో అనుబంధం ఉన్న కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. షోరూంలో మినీ-గేమ్ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.
65 దేశాలకు ఎగుమతి
నిస్సాన్ ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరంలో చాలా పనితీరు కనబరిచింది. దేశీయంగా విక్రయాలు, ఎగుమతులు కలిపి 99,000 యూనిట్లకు పైగా అమ్మింది. గత ఏడేళ్లలో ఇదే అత్యుత్తమ విక్రయాల రికార్డు. నిస్సాన్ మాగ్నైట్ మాత్రమే 28,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది. కంపెనీ ఎగుమతి చేసే దేశాల సంఖ్యను 20 నుండి 65కు పెరిగింది. నిస్సాన్ కంపెనీ ఎగుమతుల్లో మాత్రమే 71,000 యూనిట్లు విక్రయించింది.
శాశ్వత తగ్గింపు
ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల వినియోగదారుల కోసం, కంపెనీ ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. 2024లో తయారైన కార్లపై రూ. 65,000 శాశ్వత తగ్గింపు ఇస్తామని పేర్కొంది. ఈ ఆఫర్ విసియా, విసియా+, అసెండా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ వంటి టర్బో కాని మాన్యువల్ కార్లకు వర్తిస్తుంది. మీరు బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ SUV కోసం చూస్తున్నట్లయితే, నిస్సాన్ మాగ్నైట్ ఉత్తమ ఎంపిక అవుతుంది.