మారుతి సుజుకి ఈకో 7 సీటర్ కార్
మారుతి సుజుకి ఈకో మోడల్ ఒక 7 సీటర్ కారు. ఇంతకు ముందు కేవలం డ్యుయల్ ఎయిర్ బ్యాగులు మాత్రమే ఇందులో ఉండేవి. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఫిట్ చేయించడంతో ఈ కారుకు డిమాండ్ పెరిగింది. ఈ కారులో ఎయిర్ బ్యాగులు పెంచడం తప్ప కొత్త మార్పులేవీ చేయలేదు.
ఈ కారులో LXI, VXI, ZXI వంటి రకాలు కూడా ఉన్నాయి. CNG ట్రిమ్ LXI, VXI ట్రిమ్ అనే మోడల్స్ లో అందుబాటులో ఉంది. ఆఫర్‌లో ఉన్న రెండు ఇంజన్లు 65 Bhp 1.0l 3 సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 88 Hp 1.2 L 4 సిలిండర్ Na పెట్రోల్ ఇంజన్ లతో ఈ కార్లు పనిచేస్తాయి.