పాలు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు, హెయిర్ ఆయిల్, గొడుగులు, సబ్బులు, కుట్టు మిషన్లు, వాటర్ ఫిల్టర్లు, స్టీలు పాత్రలు, కుక్కర్లు, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు ఇలా సాధారణ జనానికి అత్యవసరమైనవన్నీ ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఇది ప్రజలందరికీ దీపావళికి స్వీట్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వెయ్యి రూపాయలు కన్నా తక్కువగా ఉన్న రెడీమేడ్ వస్త్రాలు కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. వెయ్యి రూపాయల ధరలోపు ఉన్న చెప్పులు కూడా ఇంకా తగ్గుతాయి. సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు కూడా తగ్గే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఇక డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీలు వంటివి కూడా తగ్గే అవకాశం ఎక్కువ ఇక కార్లు ధరలు కూడా తగ్గుతాయి. అయితే అన్ని రకాల కార్లు కాదు... కేవలం చిన్నకార్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ఖరీదైన ద్విచక్ర వాహనాలు కూడా ఎంతోకొంత తగ్గే అవకాశం ఉంది.