Earn Money From Facebook : ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి మెటా నెలకు రూ. 93 వేల వరకు చెల్లిస్తోంది. ఫేస్‌బుక్‌లో కంటెంట్ పెంచేందుకు 'క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్' ప్రోగ్రామ్ ప్రారంభమైంది.
రీల్స్ చేయండి.. నెలకు లక్ష సంపాదించండి..మెటా కొత్త స్కీమ్ అదుర్స్
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక బిగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పాపులర్ అయిన క్రియేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ పేరుతో ఒక కొత్త ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా అర్హులైన క్రియేటర్లకు నెలకు కనీసం 93,000 రూపాయల నుంచి 2.8 లక్షల రూపాయల వరకు గ్యారెంటీ ఆదాయాన్ని మెటా ఆఫర్ చేస్తోంది.
26
ఎవరికి ఈ అవకాశం? అర్హతలు ఇవే!
మెటా ప్రకటించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లేదా యూట్యూబ్‌లో కనీసం 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్న వారు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఒకవేళ క్రియేటర్లకు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉంటే, వారికి నెలకు సుమారు రూ. 2.8 లక్షల వరకు ఫిక్స్‌డ్ పేమెంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఇతర యాప్స్ లో పాపులారిటీ ఉండి, ఫేస్‌బుక్‌లో అంతగా యాక్టివ్‌గా లేని వారిని ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.
36
మెటా గ్యారెంటీ పేమెంట్స్
ఈ గ్యారెంటీ పేమెంట్స్ మొదటి మూడు నెలల పాటు అందుతాయి. అయితే, దీని కోసం క్రియేటర్లు కొన్ని షరతులు పాటించాలి. ప్రతి నెలా కనీసం 10 వేర్వేరు రోజుల్లో మొత్తంగా 15 ఒరిజినల్ రీల్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ కూడా అనుమతిస్తారు. ఈ ప్రాథమిక నిబంధనలు పాటిస్తే చాలు, మెటా నుండి నెలకు రూ. 93 వేల ఫిక్స్‌డ్ అమౌంట్ ఖాతాల్లో జమ అవుతుంది.
కేవలం ఫిక్స్‌డ్ పేమెంట్ మాత్రమే కాకుండా, క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్‌లో చేరిన వారికి ఫేస్‌బుక్ కంటెంట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
• సబ్‌స్క్రిప్షన్లు: అభిమానుల నుండి నెలవారీ రుసుము.
• స్టార్స్ : అభిమానులు ఇచ్చే టిప్స్ ద్వారా ఆదాయం.
• బ్రాండ్ కొలాబరేషన్స్: బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు.
• వ్యూ బేస్డ్ పేమెంట్స్: వీడియోలకు వచ్చే వ్యూస్‌ని బట్టి అదనపు నగదు.
దీనితో పాటు, క్రియేటర్లు పోస్ట్ చేసే రీల్స్‌కు శాశ్వత రీచ్ బూస్ట్ లభిస్తుందని మెటా స్పష్టం చేసింది.
56
ఫేస్‌బుక్ లోటును భర్తీ చేసే దిశగా..
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వినియోగదారులు ఉన్నప్పటికీ, షార్ట్ వీడియోల విషయంలో ఫేస్‌బుక్ వెనుకబడి ఉందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. క్రియేటర్లు తమ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లో పోస్ట్ చేసినంతగా ఫేస్‌బుక్‌లో చేయడం లేదని గుర్తించిన మెటా, ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. 2025లో మెటా దాదాపు $3 బిలియన్లను క్రియేటర్లకు పంపిణీ చేసింది. ఇందులో 60 శాతం ఆదాయం కేవలం రీల్స్ ద్వారానే రావడం గమనార్హం.
66
పారదర్శకత కోసం మానిటైజేషన్ డాష్‌బోర్డ్ అప్‌డేట్
ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రియేటర్లు తమ ఆదాయం, కంటెంట్ పనితీరును సులభంగా చూసుకోవడానికి మానిటైజేషన్ డాష్‌బోర్డ్‌ను మెటా అప్‌డేట్ చేసింది. పోస్ట్ చేసిన కంటెంట్ ఎందుకు మానిటైజేషన్‌కు అర్హత సాధించలేదో కూడా వివరాలు ఉంటాయి. మూడు నెలల గ్యారెంటీ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా, క్రియేటర్లు సాధారణ మానిటైజేషన్ ద్వారా సంపాదించుకోవచ్చు. కంటెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫేస్‌బుక్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది కచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి.