ఈ బిజినెస్‌లో అసలు బలం డిమాండ్. కోళ్ల ఫారాలు (Poultry Farms), గుడ్ల హోల్‌సేల్ వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు వంటి వాటిలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ట్రే తయారీ ఖర్చు తక్కువగా ఉండి, పెద్ద మొత్తంలో అమ్మితే మంచి లాభం వస్తుంది. పాడైన ట్రేలను మళ్లీ రీసైకిల్ చేసి వాడుకోవచ్చు – నష్టం చాలా తక్కువ.
ఎక్కువ లాభాలు రావాలంటే.?
మీ దగ్గరలో ఉన్న పౌల్ట్రీ ఫారాలతో డైరెక్ట్ కాంట్రాక్ట్ చేసుకోండి. స్క్రాప్ మెటీరియల్‌ను స్టాక్‌గా నిల్వ ఉంచండి. వర్షాకాలానికి ముందే డ్రైయింగ్ షెడ్ ఏర్పాటు చేయండి. చిన్నగా మొదలుపెట్టి కస్టమర్లు పెరిగేకొద్దీ మెషిన్ అప్‌గ్రేడ్ చేయండి. ప్రభుత్వం ఇచ్చే MSME లోన్స్, సబ్సిడీలు ఉపయోగించుకోండి. మొత్తం మీద పేపర్ ఎగ్ ట్రే బిజినెస్ అనేది పర్యావరణానికి మేలు చేసే, స్థిరమైన ఆదాయం ఇచ్చే మంచి అవకాశాల్లో ఒకటి. సరైన ప్లానింగ్, మార్కెట్ కనెక్షన్స్ ఉంటే గ్రామంలోనే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించడం సాధ్యమే. పని మీద పట్టుదల, ఖర్చులపై కంట్రోల్ ఉంటే ఈ చిన్న ఐడియా మీ జీవితాన్ని మార్చే పెద్ద బిజినెస్‌గా మారుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సూచనలు లేదా ఆ వ్యాపారంలో అప్పటికే అనుభవం ఉన్న వారిని సంప్రదించడం మంచిది.